OTT: డిజిటల్ వేదికగా సందడి చేయనున్న బడా మూవీలు.. ఫ్యాన్స్ కి పండగే..!!
ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఓటీటీ సంస్థలు కూడా డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకొని వ్యూస్ ను సంపాదించుకోవడం కోసం కొన్ని కోట్ల రూపాయలను వెచ్చించినట్లు తెలుస్తోంది. ఇక తాజాగా విడుదల కాబోతున్న సర్కారీ వారి పాట సినిమా మొదలుకొని.. భీమ్లా నాయక్ సినిమా వరకు ప్రతి సినిమాలు కూడా అతి తక్కువ సమయంలోనే ఓటీటీ వేదికగా విడుదల కాబోతున్న ట్లు సమాచారం. అయితే ఏ ఏ సినిమాలు ఏ ఏ ప్లాట్ఫారం లో విడుదల అవుతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
1. సర్కారు వారి పాట:
పరుశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా మే 12వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది.
2. ఆచార్య:
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ కలిసి నటిస్తున్న సినిమా ఇది.. పూజా హెగ్డే , కాజల్ కూడా హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే అయితే ఈ సినిమా ఫిబ్రవరి 4వ తేదీన థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ఇకపోతే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది.
ఇక వీటితో పాటు ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా కే జి ఎఫ్ టు సినిమాలు కూడా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన కొన్ని రోజులకే ప్రసారం కానున్నాయి. ఆర్ ఆర్ ఆర్ తో పాటు భీమ్లా నాయక్ సినిమాల డిజిటల్ రైట్స్ ను ఓటీటీ నెట్ ఫ్లెక్స్ సొంతం చేసుకుంది.