మాస్ మహారాజా రవితేజ పోయిన సంవత్సరం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన క్రాక్ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయ్ అండి అందుకున్నాడు, ఇదే జోష్ లో ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాల్లో నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే, అందులో భాగంగా ప్రస్తుతం రవితేజ నటిస్తున్న సినిమా ఖిలాడి, ఈ సినిమాలో రవితేజ సరసన డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటిస్తుండగా ఈ సినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు, దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సమకూర్చిన సంగీతానికి ఇప్పటికే ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ దక్కుతుంది.
ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి మంచి రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఈ సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలు అమాంతం పెంచేశాయి, ఇలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగివున్న ఖిలాడి సినిమాను ఫిబ్రవరి 11 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే ప్రకటించింది. అందుకు అనుగుణంగా ఈ సినిమా బృందం ప్రమోషన్ లో భాగంగా ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన కొన్ని ప్రచార చిత్రాలు కూడా విడుదల చేసింది, వీటికి కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ సినిమా విడుదల తేది ఈరోజే హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా సెహరి సినిమా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది, రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ గా జ్ఞానసాగర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు, హర్ష్ కనుమిల్లి ఈ సినిమాకి కథా రచయితగా వ్యవహరించారు. ఈ సినిమాను ఫిబ్రవరి 11 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.