ఆ స్టార్ హీరోకి సమంతనే కావాలట... ?
ఇప్పుడు ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. సమంత కోసం అంతలా ఎగబడుతున్న ఆ హీరో ఎవరా అని ఆలోచిస్తున్నారా? అతనెవరో కాదు తమిళ స్టార్ హీరో సూర్య తమ్ముడు కార్తి. యంగ్ డైరెక్టర్ సతీష్ సెల్వ కుమార్ తో ఓ సినిమా చేయనున్న కార్తి ఆ చిత్రంలో హీరోయిన్ గా సామ్ ను ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే సమంతతో సంప్రదింపులు కూడా జరిగాయని ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. కార్తి కి కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ మంచి ఇమేజ్ ఉంది. ఈ హీరో తమిళ చిత్రాలు తెలుగు లోను మంచి ఆదరణ పొందుతుంటాయి . కాగా ఈ కొత్త సినిమా కూడా తెలుగులో రానుంది.
సమంత నటించిన శాకుంతలం సినిమా... విడుదలకు రెడీగా ఉండగా, యశోద సినిమా కూడా దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రెండు చిత్రాల తర్వాత కార్తీ తో సినిమా చేస్తుందా లేక ఎప్పుడు సినిమా పట్టాలెక్కుతోంది అన్న పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.