టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం డిజిటల్ మీడియాలో తన సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. తెలుగు ఓటీటీ 'ఆహా' లో ప్రసారమయ్యే 'అన్ స్టాపబుల్' అనే టాక్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఆడియన్స్ కి కావలసినంత వినోదాన్ని అందిస్తున్నారు. ఇక ఫిబ్రవరి 4వ తేదీన అన్ స్టాపబుల్ సీజన్ 1 పూర్తి అవుతుంది. చివరి ఎపిసోడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు బాలయ్యతో సందడి చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రోమో ఎంతలా వైరల్ అయిందో తెలిసిందే. ఇక ఇప్పటికే మొదటి సీజన్లో హీరోలతో పాటు దర్శకులు కూడా హాజరవడం జరిగింది.
కానీ సీజన్ 1 లో మెగాస్టార్ చిరంజీవి వస్తారని అందరూ భావించారు. కానీ చిరు మాత్రం రాలేదు. అయితే మెగాస్టార్ రాకపోవడానికి గల కారణాలను ఓ సందర్భంలో దర్శకుడు బి.వి.ఎస్.రవి వెల్లడిస్తూ చిరంజీవి ఈ వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్లే ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు అని తెలిపారు. అంతేకాకుండా ఈ సీజన్ పూర్తి కావడంతోనే త్వరలో రెండో సీజన్ కూడా ప్రారంభం అవుతున్నట్టు తెలిపారు. ఇక రెండవ సీజన్ కి మొదటి గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి రానున్నట్లు ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్దఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇదే విషయాన్ని డైరెక్టర్ బి.వి.ఎస్.రవి కూడా పరోక్షంగా వెల్లడించడం జరిగింది.
ఇక మొదటి సీజన్ సీనియర్ హీరో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తో ప్రారంభం కాగా.. చివరి ఎపిసోడ్ మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబుతో పూర్తి అవుతుంది. ఇక రెండవ సీజన్ మాత్రం మెగాస్టార్ చిరంజీవి తో గ్రాండ్ గా స్టార్ట్ కానుందని తెలుస్తోంది. ఇక ఈ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుండడంతో మెగా ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఒకే వేదికపై బాలకృష్ణ, చిరంజీవి కనిపించడంతో ప్రేక్షకులకు పూనకాలు రావడం మాత్రం గ్యారెంటీ అని చెప్పొచ్చు. ఇక ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా త్వరలోనే రాబోతున్నట్లు తెలుస్తోంది...!!