సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ...అయితే ఈయన కెరియర్ లో ఓ మైలు రాయి చిత్రంగా నిలిచిన చిత్రం అల్లూరి సీతారామరాజు.అయితే ఈ సినిమా 1970 మే 1న విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టి..ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకుంది. ఇకపోతే సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా ఫై పలుసార్లు స్పందించారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని మహేష్ రీమేక్ చేయబోతున్నాడనే వార్త ప్రస్తుతం నెట్టింట్లో చాలా వైరల్ గా మారింది. ఇకపోతే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న హీరోలు అందరూ పాన్ ఇండియా స్టార్స్ గా మారుతున్నారు.
ఇకపోతే ఇప్పటికే ప్రభాస్ , అల్లు అర్జున్ లు పాన్ ఇండియా స్టార్స్ కాగా..వీరి బాటలోనే రామ్ చరణ్ , ఎన్టీఆర్ లు కూడా ఉన్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు కూడా పాన్ ఇండియా హీరో అవ్వాలని అనుకుంటున్నాడట.అయితే అందుకే అల్లూరి సీతారామరాజు రీమేక్ ను పాన్ ఇండియా మూవీ గా చేయాలనీ చూస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ వార్తల్లో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటిస్తున్న చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా వేసవి కానుకగా మే 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇక ఈ మూవీ చివరి షెడ్యూల్ ఈరోజు నుండి హైదరాబాద్ లో మొదలుకాబోతుంది. ఈ సినిమాని పరుశురాం డైరెక్టర్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, జి.ఎమ్.బి క్రియేషన్స్ 14రీల్స్ సంస్థ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ కు జోడిగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా లోని మొదటి పాట ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. అందుకు సంబంధించి ఈ చిత్రానికి ఇప్పటికే అధికారిక ప్రకటన చేయగా.. ఈ పాట కోసం మహేష్ బాబు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు...!!