అరిగిపోయిన చెప్పులతో బన్నీ.. ఫోటో వైరల్..

Satvika
ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్, రష్మిక మందన్న నటించిన క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన హ్యాట్రిక్ ఫిల్మ్ 'పుష్ప డిసెంబర్‌17న పాన్ ఇండియా మూవీగా విడుదల అయ్యింది. కొద్ది రోజులలొనె 100 కోట్ల వసూళ్లతో దూసుకుపోతోంది.. బాలివుడ్ లో కూడా సేమ్ టాక్ తో దూసుకుపోతోంది. మొత్తానికి బన్నీ ఈ సినిమా తో మంచి టాక్ ను అందుకున్నాడు. ఈ సినిమాలో మాస్ లుక్ లో పుష్ప రాజ్ పాత్రలో బన్నీ కనిపించారు.బీ టౌన్ సెలబ్రిటీలు, ప్రముఖులు ఈ మూవీ చూసి ఫిదా అయిపోతున్నారు.


కాగా, ఈ పిక్చర్‌కు అరిగిపోయిన చెప్పులతో సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో నెటిజన్ల మధ్య పెద్ద చర్చ జరుగుతుంది..ఈ సినిమాలొని హైలెట్ డైలాగులు, కొన్ని పాటలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు.. ఇండియన్ క్రికెటర్సే మాత్రమే కాదు. ఫారిన్ క్రికెటర్స్ సైతం 'తగ్గేదేలే' అని డైలాగ్స్ చెప్తూ స్టెప్స్ వేస్తున్నారు. ఆ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. అలా సినిమాను బాగా ప్రమోట్ చేశారు.


శ్రీవల్లి' సాంగ్ కు బన్నీ డ్యాన్స్ చేస క్రమంలో చేతికి ఉన్న కాలి చెప్పును విడిచిపెడతాడు. తర్వాత మళ్లీ దానిని తొడుక్కుంటాడు. అలా ఆ సాంగ్ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది.. ఆ స్టెప్ ను బన్నీ లాగా చేయాలనీ చాలా మంది ట్రై చెస్తున్నారు. కొందరు ఓ మాదిరిగా చేసి సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు..తాజాగా ఓ ఎయిర్ హోస్టెస్ కూడా ఆ స్టెప్ ట్రై చేసింది. ఈ సంగతులు అలా ఉంచితే.. ఈ హుక్ స్టెప్ కు లింక్ చేస్తూ ప్రజెంట్ ఓ ఫొటో మీమ్ వైరల్ చేస్తున్నారు. ఆ ఫొటోలు అరిగిపోయిన చెప్పులున్నాయి.. ఆ పాట కోసం బన్నీ చాలా టేక్ లు తీసుకోవడం వల్ల చెప్పులు అరిగిపొయాయని నెటిజన్లు కామెంట్లు చెస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: