షాక్: తన భర్త అ పని చేస్తాడంటూ ఓపెన్ అయిన ప్రియమణి..!!

Divya
తెలుగులో అగ్ర హీరోలందరి సరసన నటించింది ప్రియమణి.. తన నటనతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది.. అటు గ్లామర్ ఉండే పాత్రలకు సూటయ్యే కంటెంట్ తో అటు ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. ఇక తాజాగా వెబ్ సిరీస్ లో కూడా తన హవాని కొనసాగిస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా ఆహాలో మరొక వెబ్ సిరీస్ లో మెరవనుంది. అదే భామాకలాపం. ఈ సిరీస్ లో ప్రియమణి అనుపమ అనే పాత్రలో ఒక చెఫ్ గా నటిస్తోంది.త్వరలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.. ఈ సందర్భంగా తన వ్యక్తిగత విషయాల గురించి కొన్ని విషయాలను తెలియజేసింది.. వాటి గురించి చూద్దాం.

భామాకలాపం సిరీస్ లో నటించిన తన పాత్రకు రియల్ లైఫ్ పాత్రకు ఏ విధంగా సంబంధం లేదని తెలియజేసింది ప్రియమణి. ఈ సిరీస్ లో చెఫ్ గా నటించిన తన నిజ జీవితంలో తనకు అసలు వండడం రాదని తెలియజేసింది. తన భర్త ముస్తఫా రాజ్ కొండి పెడితే నేను తింటూ ఉంటాం అని తెలియజేసింది.. తన భర్త ఎక్కువగా ఇంట్లో ఉండడానికి ఇష్టపడతారని.. తెలియజేసింది ప్రియమణి. తను నటించిన భామాకలాపం లోని అనుపమ పాత్ర తన నిజ జీవితం లో అసలు ఉండకూడదని కోరుకుంటటోందట ప్రియమణి.

 ఒక మహిళా ఎప్పటికైనా తన కుటుంబానికి..తన భర్తకు జవాబుదారీగా ఉంటే చాలని తెలియజేసింది ప్రియమణి. ఇక అంతే కాకుండా తన మీద వచ్చిన వివాదాలను తను ఎప్పుడూ లైట్ గా తీసుకుంటానని తెలియజేసింది. అంతేకాకుండా తన మీద తన ఫ్యామిలీ మీద వచ్చే విమర్శల పైన తను ఎప్పుడూ కామ్ గా ఉంటానని తెలిపింది ప్రియమణి.తనకు సంబంధించిన ఎటువంటి విషయాలు అయినా సరే ఒక చెవితో విని మరో చెవితో వదిలెయ్యడం మంచిదని తెలియజేసింది. ఆ విమర్శలు ఏదో ఒకరోజు కనుమరుగవుతాయి అని తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: