NBK107: ఫ్యాన్స్ కి ట్రిపుల్ ట్రీట్ ఇవ్వనున్న బాలయ్య..?

Anilkumar
నటసింహ నందమూరి బాలకృష్ణ ఇటీవలే 'అఖండ' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుని.. మరోవైపు డిజిటల్ ప్లాట్ ఫామ్ పై 'అన్ స్టాపబుల్' టాక్ షో సక్సెస్ తో ఫుల్ జోష్ మీద ఉన్నారు. అదే జోష్ తో ఇప్పుడు తన కొత్త సినిమా షూటింగ్ కి రెడీ అవుతున్నాడు. ఇటీవల క్రాక్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు గోపీచంద్ మలినేని బాలకృష్ణ 107 వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మా ఫస్ట్ షెడ్యూల్ ఈ నెల 12 నుంచి ప్రారంభం కానుంది. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి యువ సంగీత దర్శకుడు తమన్ సంగీతం అందిస్తున్నారు.

రాయలసీమ - కర్ణాటక బోర్డర్ నేపథ్యంలో కొన్ని వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతుంది. సినిమాలో బాలకృష్ణ ట్రిపుల్ రోల్ లో కనిపించనున్నారంటూ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఇటీవల విడుదలైన అఖండ సినిమా తో సహా గతంలో బాలయ్య నటించిన చాలా సినిమాల్లో ఆయన డ్యూయల్ రోల్ చేసి మెప్పించారు. అయితే బాలకృష్ణ మూడు పాత్రల్లో నటించి మాత్రం చాలా కాలమే అవుతోంది. సుమారు పది సంవత్సరాల క్రితం 'అధినాయకుడు' అనే సినిమాలో మూడు పాత్రల్లో కనిపించిన బాలయ్య మళ్లీ ఇన్నాళ్లకి అభిమానులకు తన 107 వ సినిమా ద్వారా ట్రిపుల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడట.

ప్రస్తుతం ఈ వార్త తో బాలయ్య ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అవుతున్నారు. అయితే బాలయ్యను మూడు పాత్రల్లో గోపీచంద్ మలినేని ఎలా హ్యాండిల్ చేస్తాడు అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈ సినిమాలో బాలయ్య ఒక పాత్రలో ఫ్యాక్షనిస్ట్ గా మరో పాత్రలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక వీటితో పాటు మరొక పాత్రలో స్వామిజి అవతారం లో బాలయ్య కనిపించనున్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన లేకపోయినా.. ఈ వార్త మాత్రం ఫిల్మ్నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: