టాలీవుడ్ లో ఇటీవలే`లవ్ స్టోరి`, `శ్యామ్ సింగ రాయ్` సినిమాలతో చాన్నాళ్ళ తరువాత బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది డాన్సింగ్ సెన్సేషన్ సాయి పల్లవి. ఇక ఇదిలా ఉంటే త్వరలో ఈ టాలెంటెడ్ యాక్ట్రస్ నటించిన `విరాట పర్వం` జనం ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమాలో సాయి పల్లవి ఇందులో హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటికి జోడీగా నెవర్ సీన్ బిఫోర్ రోల్ లో ప్రేక్షకుల ముందు దర్శనమివ్వనుంది. వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తికాగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. అతి త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనుంచి చిత్రబృందం.
ఇక ఇప్పటికే ఈ ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ కి మంచి స్పందన లభించింది. సాయి పల్లవి ఖాతాలో ఈ సినిమాతో మరో హిట్ ఖాయం అని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ విషయం ఎలా ఉంటే సాయి పల్లవి తాజాగా తన మాతృభాష తమిళంలో ఓ కొత్త ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇక అసలు విషయానికి వస్తే....అయితే కోలీవుడ్ లో వరుస విజయాలతో ముందుకు సాగుతున్న యంగ్ సెన్సేషన్ హీరో శివ కార్తికేయన్ తో లోక నాయకుడు కమల్ హాసన్ హోమ్ బేనర్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంస్థ ఓ సినిమాని నిర్మించడం జరుగుతుంది.
ఇక ఈ సినిమాకు రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు.
అయితే ఈ సినిమాలో శివ కార్తికేయన్ కి జంటగా సాయి పల్లవిని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. ఇక ఇదిలా ఉంటే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సాయి పల్లవికి ఈ సినిమాకి సంబంధించిన కథ నచ్చడంతో ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.ఇకపోతే త్వరలోనే శివ కార్తికేయన్, సాయి పల్లవి జోడీపై క్లారిటీ రానున్నది.అయితే తమిళనాట ఇప్పటివరకు సాలిడ్ హిట్ లేని సాయి పల్లవికి ఈ చిత్రంతోనైనా ఆ ముచ్చట తీరుతుందేమో చూడాలి...!!