మళ్ళీ స్పెషల్ ఈవెంట్ కి ప్లాన్ చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ ..
ఇక తాజా రిలీజ్ డేట్ ప్రకారం `ఆర్ ఆర్ ఆర్` సినిమా మార్చి 25న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది. ఇది ఇక ఫైనల్ డేట్. ఈ డేట్ లో ఎలాంటి మార్పు అనేది ఇక వుండదు. ఒక వేళ పరిస్థితులు కనుక మళ్లీ దారుణ స్థాయికి వెళ్లితే తప్ప `ఆర్ ఆర్ ఆర్` సినిమా రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు వుండదు. ఇక ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రచారం కోసం మళ్లీ ప్రత్యేకంగా ప్రచార కార్యక్రమాల్ని నిర్వహించబోతున్నారు. ఇందు కోసం జక్కన్న రాజమౌళి ఓ స్పెషల్ ఈవెంట్ ని కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.మార్చి సెకండ్ వీక్ నుంచి మళ్లీ ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో స్పెషల్ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారట దర్శకధీరుడు రాజమౌళి. అయితే అది ఇండియాలో మాత్రం కాదట.యుఎస్ లో అని సమాచారం తెలిసింది. అక్కడ లభించే పర్మీషన్ ని బట్టి భారీ ఈవెంట్ ని ఏర్పాటు చేయాలన్నది దర్శకధీరుడు రాజమౌళి ఆలోచనగా సమాచారం అనేది తెలుస్తోంది. ఈ సారి దర్శకధీరుడు రాజమౌళి ఏ రేంజ్లో ప్రచారాన్ని ప్లాన్ చేశాడన్నది తెలియాలంటే వచ్చే నెల ఫస్ట్ వీక్ దాకా ఎదురు చూడాల్సిందే.