ఛీఛీ.. ఇలాంటోడివా..! జర్నలిస్ట్ కి గడ్డిపెట్టిన టాలీవుడ్ హీరోయిన్..

Deekshitha Reddy
వేదికపై హీరో, హీరోయిన్, ఇతర తారాగణం ఉన్నారు, అంతా బాగానే జరుగుతుందనుకున్న టైమ్ లో ఓ సినిమా జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న అక్కడున్న అందరికీ కోపం తెప్పించింది. అంతే కాదు, అతడిపై ఏహ్య భావాన్ని కూడా కలిగించింది. అప్పటి వరకూ పెద్ద జర్నలిస్ట్ గా ఫోజు కొట్టిన అతగాడి ఆలోచనా పరిధి మరీ అంత చిన్నదా అని అందరూ మనసులో చీవాట్లు పెట్టారు. ఈ ఇన్సిడెంట్ డీజే టిల్లు ట్రైలర్ లాంఛ్ కార్యక్రమంలో జరిగింది.

సొంతగా ఓ సినిమా పత్రిక నడుపుకునే సురేష్ కొండేటి.. డీజే టిల్లు ట్రైలర్ లాంఛ్ కార్యక్రమంలో హీరోయిన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా ట్రైలర్ లో హీరోయిన్ ఒంటిపై ఎన్ని పుట్టుమచ్చలున్నాయని హీరో అడిగే సన్నివేశం ఉంది. దాన్ని బేస్ చేసుకుని రియల్ గా ఆ హీరోయిన్ ఒంటిపై ఎన్ని పుట్టుమచ్చలున్నాయో తెలుసుకున్నావా అంటూ హీరోని ఆ ఫంక్షన్లో అందరి ముందు మైక్ పట్టుకుని అడిగారు సురేష్. దానికి హీరో హుందాగా సమాధానం చెప్పారు. ఈ ప్రశ్నను నేను అవాయిడ్ చేస్తున్నానని అన్నారు. సురేష్ కొండేటి కొంటెగా అ ప్రశ్న అడిగానని అనుకున్నా.. అది రివర్స్ అయింది. అసలా ప్రశ్న హీరోయిన్ ముందు అలా పబ్లిక్ గా అడగడం ఏంటని చాలామంది సోషల్ మీడియాలో విమర్శించారు కూడా. హీరోయిన్ నేహాశెట్టి కూడా ఈ ప్రశ్నపై తీవ్రంగా స్పందించింది.

అప్పటికప్పుడు స్టేజ్ పై సురేష్ కొండేటి దుమ్ము దులపకపోయినా.. సోషల్ మీడియాలో తన సమాధానంతో గడ్డి పెట్టింది. తనపై అలాంటి కామెంట్లు చేసిన వ్యక్తి, తన చుట్టుపక్కల ఉండేవారిని ఎలా చూస్తారో, తనతోపాటు కలసి పనిచేసే వారితో ఎలా ప్రవర్తిస్తారో అంటూ మెసేజ్ పెట్టింది నేహా శెట్టి. తన ఆగ్రహాన్ని, అసహనాన్ని అలా తెలియజేసింది.

మొత్తమ్మీద ఈ వ్యవహారంతో సినిమా ఫంక్షన్లలో కొంతమంది మితిమీరి ప్రవర్తించే వ్యవహారం హైలెట్ అవుతోంది. స్టేజ్ పై ఉన్న వ్యక్తుల్ని ఎలాంటి ప్రశ్నలు అడగాలి, ఎలాంటి ప్రశ్నలు అడగకూడదు అనే వ్యవహారం తెరపైకి వచ్చింది. అందులోనూ సీనియర్ జర్నలిస్ట్ లు అని చెప్పుకునేవారు కూడా ఇలాంటి ప్రశ్నలు అడుగుతారా అని సోషల్ మీడియా ముక్కున వేలేసుకునేలా చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: