ఆ లోపమే ఎన్టీఆర్‌కు వరమవ్వనుందా..?

N.ANJI

టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్‌కు క్రేజ్ మామూలుగా ఉండదు. విభిన్నమైన పాత్ర, విలక్షణమైన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. సినిమా సెట్స్ పై ఉన్నప్పుడు ఆ మూవీ సక్సెస్ అవ్వడానికి దర్శక నిర్మాతలు ఎంత శ్రమిస్తారో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా అంతే శ్రమిస్తారని చెప్పడంతో ఎలాంటి సందేహం లేదు. అంతలా కేర్ తీసుకుంటారు కాబట్టే.. ఆయన సినిమాలు మంచి హిట్ అందుకుంటాయి. అయితే ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది.


అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి బిజీగా ఉంటున్నారు.  ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత హీరో ఎన్టీఆర్ దర్శకులు కొరటాల శివ, బుచ్చిబాబు, ప్రశాంత్ నీల్‌లతో కలిసి సినిమా చేయనున్నారు. వరుసగా మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దర్శకుడు బుచ్చిబాబు డైరెక్షన్‌లో వస్తున్న సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఎంతో ప్రత్యేకంగా ఉండబోతోందట. అయితే దర్శకుడు బుచ్చిబాబు.. లెజెండరి డైరెక్టర్ సుకుమార్ శిష్యుడనే విషయం తెలిసింది. గురువుకు తగ్గ శిష్యుడిలా తన సినిమా కూడా కాస్త భిన్నంగా ఉండేలా ప్రయత్నిస్తున్నారు.


కాగా, ఇటీవల సుకుమార్ దర్శకత్వం వహించిన సినిమా పుష్ప. ఈ సినిమాలో అల్లు అర్జున్‌కు ఒక లోపం ఉన్నట్లుగా చూపించారు. అదే తరహాలో దర్శకుడు బుచ్చిబాబు కూడా జూనియర్ ఎన్టీఆర్‌కు ఒక లోపంతో బాధపడే పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. దీనిపై దర్శకుడు సుకుమార్ కూడా తన శిష్యుడు బుచ్చిబాబుకు సలహా ఇచ్చినట్లు సమాచారం. కాగా, ఈ సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.


గత రెండ్రోజులుగా ఈ సినిమా టైటిల్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇందులో ఎన్టీఆర్ ఒక కబడ్డీ ప్లేయర్‌గా కనిపించనున్నాడని, ఒక లోపంతో ఉన్నా ఎన్టీఆర్ ఎలా ప్లేయర్‌గా రాణిస్తాడు, ఎలా ఎంటర్‌టైన్ చేయబోతున్నాడని సినిమా రిలీజ్ అయితేనే తెలుస్తుంది. తన ఫస్ట్ సినిమాతో మంచి హిట్ అందుకున్న బుచ్చిబాబుకు.. ఈ సినిమా సక్సెస్ అయితే స్టార్ డైరెక్టర్ వరుసలో నిలుస్తారు. కాగా, దర్శకులు బుచ్చిబాబు, ప్రశాంత్ నీల్.. రెండు సినిమాలు సెట్స్‌ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: