నాని కాన్ఫిడెన్స్ ఏంటి... ఏకంగా 7 రిలీజ్ డేట్లు
ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళి భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన చిత్రం "ఆర్ ఆర్ ఆర్" కు ఒక విడుదల తేదీని ప్రకటించిన రోజు నుండి ఇండస్ట్రీలో అలజడి మొదలైంది. ఆర్ ఆర్ ఆర్ మార్చ్ 25 న విడుదల కానుంది. కాగా ఈ సినిమా విడుదలను బట్టి మిగిలిన సినిమాలు విడుదల కావడానికి ప్లాన్ చేసుకుంటున్నాయి. కాగా శ్యామ్ సింగరాయ్ హిట్ తర్వాత నాని 'అంటే సుందరానికి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కానీ నాని మాత్రం తన సినిమా రిలీజ్ కు ఏకంగా 7 తేదీలు ఇవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చ అవుతోంది. ఎందుకంటే చాలా వరకు వేసవిలో విడుదల అయ్యే సినిమాలు రెండు విడుదల తేదీలను ప్రకటించాయి.
కానీ నాని కొంచెం కొత్తగా ఆలోచించి ఈ విధంగా 7 తేదీలు ఇచ్చాడు. వాటిలో ఏప్రిల్ 22, ఏప్రిల్ 29, మే 6, మే 20, మే 26, మే 27, జూన్ 3 మరియు జూన్ 10 తేదీలను లాక్ చేశాడు. ఈ వార్త అనంతరం ఇండస్ట్రీ అంతా షాక్ లో ఉంది. ఈ 7 డేట్ లలో ఏ డేట్ లో 'అంటే సుందరానికి' మూవీ రిలీజ్ అవుతుంది అని మిగిలిన సినిమా బృందాలకు కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు. మరి చూద్దాం ఇంతలా రిలీజ్ డేట్ ప్రకటించినా సినిమాలో దమ్ము లేకపోతే ఏమి లాభం.