టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ క్రేజీ హీరోయిన్ లలో హాట్ బ్యూటీ రాశి ఖన్నా ఒకరు, ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ ఆడియెన్స్ ని పలకరించిన ఈ ముద్దుగుమ్మ, ఈ సినిమా తర్వాత అనేక టాలీవుడ్ సినిమాల్లో నటించి ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతుంది. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకున్న ఈ ముద్దుగుమ్మ ఇతర భాష సినిమాల్లో కూడా నటించి అక్కడ కూడా మంచి పాపులారిటీని సంపాదించుకుంది, ప్రస్తుతం రాశి ఖన్నా తెలుగులో నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న థాంక్యూ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది, ఈ సినిమాతో పాటు గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పక్కా కమర్షియల్ సినిమాలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా నటిస్తోంది, వీటితో పాటు పలు బాలీవుడ్ ప్రాజెక్ట్ లలో కూడా రాశి ఖన్నా నటిస్తోంది.
ఇది ఇలా ఉంటే తమిళ ఇండస్ట్రీలో కూడా ఈ ముద్దుగుమ్మ కొన్ని సినిమాలలో నటించింది, అందులో భాగంగా రాశి ఖన్నా 'అరణ్మనై త్రీ' అనే సినిమాలో నటించింది, ఈ సినిమానే తెలుగులో అనంతపురం అనే పేరుతో విడుదల చేశారు, కాకపోతే ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది, ఈ సినిమా హార్రర్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది. ఇలా తెలుగు, తమిళ్, హిందీ సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని అడుగుతున్న రాశి ఖన్నా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పెంచుకుంటూ ఉంటుంది, అలాగే అప్పుడప్పుడు తన అందచందాలను ప్రదర్శించేల ఉన్న ఫోటోలను కూడా ఈ ముద్దుగుమ్మ పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటె కొన్ని రోజుల క్రితం కూడా రాశి ఖన్నా తన ఇన్ స్టా అకౌంట్ లో కొన్ని పిక్స్ ని పోస్ట్ చేసింది, ఈ ఫోటోలలో హాట్ బ్యూటీ రాశి ఖన్నా అదిరిపోయే లుక్ లో సారీ కట్టుకొని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది, ఈ ఫోటోలను చూసిన కొంతమంది నెటిజన్లు గార్జియస్, నైస్, లవ్ సింబల్ ఎమోజీ లను కామెంట్లు పెడుతున్నారు, ఇప్పటికి కూడా రాశి ఖన్నా కు సంబంధించిన ఈ ఫోటోలు ఇప్పటికి కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.