బంగార్రాజు తో ఫుల్ ఫామ్ లోకి నాగార్జున..!

Pulgam Srinivas
టాలీవుడ్ కింగ్ నాగార్జున 'సోగ్గాడే చిన్నినాయన' బ్లాక్ బాస్టర్ విజయం తర్వాత ఆ రేంజ్ విజయాన్ని అందుకోవడం లో కాస్త వెనకబడ్డాడు, ఆ తర్వాత వరుసగా రాజుగారి గది త్రీ, దేవ్ దాస్, వైల్డ్ డాగ్ వంటి వరుస అపజయాలు నాగార్జున ను బాక్స్ ఆఫీస్ దగ్గర పలకరించాయి. అలాంటి సమయంలో నాగార్జున కు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని తీసుకువచ్చిన సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన బంగార్రాజు సినిమాలో నటించాడు, సోగ్గాడే చిన్ని నాయన మంచి విజయం సాధించడంతో బంగార్రాజు సినిమాపై కూడా మొదటి నుండి కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి, దానికి తోడు ఈ సారి సంక్రాంతికి పెద్ద సినిమాలు కూడా ఏవీ బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల కాకపోవడంతో బంగార్రాజు సినిమాకు ఈ అంశం బాగా కలిసి వచ్చింది.  ఇలా అనేక ప్లస్ పాయింట్స్ తో థియేటర్ లలో జనవరి 14 వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదలైన బంగార్రాజు సినిమా మొదటి రోజు నుండే మాంచి టాక్ ను సంపాదించుకొని కలెక్షన్ లను కూడా బాగానే రాబట్టింది,  ఇప్పటివరకు వస్తున్న వార్తల ప్రకారం బంగార్రాజు సినిమా ప్రపంచ వ్యాప్తంగా 76 కోట్ల వరకు కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.


 ఇది నాగార్జున కెరియర్ లోనే హయ్యస్ట్ కలెక్షన్స్  అని కూడా తెలుస్తోంది, ఇలా సోగ్గాడే చిన్నినాయన సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న నాగార్జున మరోసారి ఆ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన బంగార్రాజు సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకని ఫుల్ ఫామ్ లోకి వచ్చేశాడు,  నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఘోస్ట్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు, మరి ఈ సినిమాతో నాగార్జున ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో అనుకుంటాడో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: