హిట్ ఫార్ములా అర్థమైంది.. అందుకే అప్లై చేస్తున్నారు..?
ఇండస్ట్రీలో సక్సెస్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో, సెంటిమెంట్‌కీ అంతే ప్రియారిటీ ఇస్తారు. ఇంతకుముందు టాలీవుడ్‌లో సీక్వెల్స్ హిట్‌కావనే సెంటిమెంట్ ఉండేది. దీంతో చాలామంది స్టార్లు సీక్వెల్స్‌కి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించేవాళ్లు కాదు. కానీ ఇప్పుడీ ట్రెండ్ మారింది. భారీ వసూళ్లకి సీక్వెల్స్‌ని బెస్ట్ ఆప్షన్‌గా చూస్తున్నారు మేకర్స్. తెలుగునాట డబ్బింగ్ సినిమాలకి పెద్దగా క్రేజ్ ఉండదు. రజనీకాంత్, సూర్య, కార్తీ లాంటి తమిళ హీరోలు తెలుగునాట హంగామా చేసినా, కన్నడ సినిమాలకి పెద్దగా మార్కెట్ లేదు. కానీ ప్రశాంత్ నీల్, యశ్ కాంబినేషన్‌లో వచ్చిన 'కెజిఎఫ్' తెలుగునాట కన్నడ సినిమాలకి కూడా మార్కెట్ తెచ్చిపెట్టింది. ఇక ఈ మూవీకి కొనసాగింపుగా వస్తోన్న 'కెజిఎఫ్2'పైనా టాలీవుడ్‌లో భారీ బజ్ ఉంది. టీజర్‌కి క్రేజీ రెస్పాన్స్ రావడంతో 'కెజిఎఫ్2' భారీగా వసూల్ చేస్తుందనే అంచనాలున్నాయి.
'కార్తీకేయ, ప్రేమమ్' సినిమాలతో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న చందు మొండేటికి 'సవ్యసాచి'తో బ్రేకులు పడ్డాయి. చందు యాక్షన్ స్టోరీని హ్యాండిల్ చెయ్యలేకపోయానే కామెంట్స్ కూడా వచ్చాయి. అయితే ఇప్పుడీ విమర్శలకి కౌంటర్‌గా 'కార్తికేయ2' తీస్తున్నాడు చందు మొండేటి. క్రైమ్ థ్రిల్లర్స్, స్పై స్టోరీస్‌తో హిట్స్ కొడుతోన్న అడివి శేష్ ఇప్పుడు నాని నిర్మాణంలో 'హిట్2' చేస్తున్నాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్‌సేన్ హీరోగా నటించిన 'హిట్' సీక్వెల్‌గా వస్తోంది ఈ సినిమా. అలాగే 'గూడచారి'కి కూడా సీక్వెల్ చేస్తున్నాడు అడివి శేష్.