వామ్మో.. 'రాధేశ్యామ్' డిజిటల్ - శాటిలైట్ రైట్స్ అన్ని కోట్లకు అమ్ముడైందా...?

Anilkumar
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాధా కృష్ణ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన తాజా చిత్రం 'రాధేశ్యామ్'. యు.వి.క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడగా.. తాజాగా ఈ సినిమా విడుదల తేదిని అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. మార్చి 11న ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇతర సినిమా రిలీజ్ విషయంలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ రెండు రేట్లు ప్రకటించగా.. ప్రభాస్ మాత్రం సింగిల్ గానే రంగంలోకి దిగుతున్నాడు. అందరికంటే ముందే వస్తున్నాడు.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్తా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రాధేశ్యామ్ చిత్రానికి భారీగా ఓటీటీ ఆఫర్ వచ్చిందని గతంలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఏకంగా 450 కోట్లకు ప్రముఖ ఓటీటీ సంస్థ ఆఫర్ చేసిందని.. త్వరలోనే ఈ సినిమా ఓటీటీ లో విడుదల కానుందని కొన్ని వార్తలు వినిపించాయి. కానీ అవన్నీ పుకార్లే అని చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. అయితే తాజా సమాచారం ప్రకారం రాధేశ్యామ్ డిజిటల్, శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయాయని సమాచారం. ప్రముఖ ఓటీటీ సంస్థ లు అయిన నెట్ ఫ్లిక్స్, జీ5   భారీగా వెచ్చించి ఈ సినిమా రైట్స్ ను దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

ఏకంగా 250 కోట్ల కి రాధే శ్యామ్ డిజిటల్ శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయాయని ఓ వార్త ప్రస్తుతం నెట్టింట ఎంతో వైరల్ గా మారుతోంది. ఇక ఈ విషయంలో ప్రభాస్ రాధే శ్యామ్ సరికొత్త రికార్డ్ సృష్టించింది అని చెప్పవచ్చు. ఎందుకంటే డిజిటల్ రైట్స్ విషయంలో రాజమౌళి త్రిబుల్ ఆర్ సినిమా ఇప్పుడు టాప్ లో ఉంది. ఈ సినిమా ఏకంగా 325 కోట్లకు సేల్ అయింది. ఆ తర్వాత ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా నిలవడం విశేషం.ఇక ప్రస్తుతం ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. మరోవైపు ఈ సినిమా తమిళ థియేటర్ రైట్స్ కూడా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: