టాలీవుడ్ లో ఇటీవల విడుదలైన 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రికార్డు కలెక్షన్లు సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా తర్వాత సోషల్ మీడియాలో బన్నీకి క్రేజ్ భారీగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఇంస్టాగ్రామ్ లో ఏకంగా 15 మిలియన్ల మంది ఫాలోవర్స్ ని సంపాదించుకున్న అల్లు అర్జున్.. కేవలం పది రోజుల్లోనే 1 మిలియన్ ఫ్యాన్స్ ని సొంతం చేసుకున్నాడు.
కేవలం పుష్ప సినిమాతో వచ్చిన క్రేజ్ తోనే పది రోజుల్లో ని సోషల్ మీడియాలో రికార్డ్స్ బ్రేక్ చేశాడు బన్నీ. ప్రస్తుతం బన్నీకి ఇంస్టాగ్రామ్ లో 16 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఇదిలా ఉంటే తాజాగా సామాజిక మాధ్యమాల్లో మరో అరుదైన ఘనతను అందుకున్నాడు అల్లు అర్జున్. సాధారణంగా సౌత్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజనీకాంత్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అన్ని భాషల, అన్ని వర్గాల ఆడియన్స్ రజనీకాంత్ ని విపరీతంగా అభిమానిస్తారు. ప్రస్తుతం రజనీకాంత్ ను ట్విట్టర్లో 6.1 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. అలాంటిది ఇపుడు రజనీకాంత్ ను మించిన ఫాలోయింగ్ ను అల్లుఅర్జున్ సంపాదించుకున్నాడు.
ప్రస్తుతం అల్లు అర్జున్ ట్విట్టర్లో 6.5 మిలియన్ల ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నాడు. రజినీకాంత్ ట్విట్టర్ లో 24 మంది ఫాలో అవుతుంటే.. బన్నీ మాత్రం ఎవరిని ఫాలో అవ్వకపోవడం గమనార్హం. బన్నీ ఎవర్ని ఫాలో అవ్వకుండానే ట్విట్టర్లో 6.5 మిలియన్ల ఫాలోవర్స్ రావడం అనేది ఒక సరికొత్త రికార్డు అని చెప్పవచ్చు. ట్విట్టర్లో కూడా బన్నీ కి ఇంత లా ఫాలోయింగ్ పెరగడానికి పుష్ప సినిమానే కారణం అని నిస్సందేహంగా చెప్పవచ్చు. మరి పుష్ప పార్ట్1 తోనే బన్నీ సోషల్ మీడియాలో ఈ రేంజిలో ఫాలోయింగ్ ను సంపాదించుకుంటే మరి పుష్ప పార్ 2 తో ఎలాంటి పాపులారిటీని దక్కించుకుంటాడో చూడాలి...!!