హీరోయిన్ పుట్టు మచ్చల వివాదంపై డీజే టిల్లు రియాక్షన్..!

Anilkumar
టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ మూవీ 'డీజే టిల్లు'. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన ఈ సినిమా చిత్రం ట్రైలర్ లాంచ్ ఇటీవల హైదరాబాద్ లో జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఓ సీనియర్ జర్నలిస్టు సిద్ధు జొన్నలగడ్డ కి హీరోయిన్ పుట్టు మచ్చల గురించిన ప్రశ్నను సంధించడం  ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. అయితే దీనిపై హీరో సిద్దు ఇప్పటివరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. దీంతో ఈ వివాదం కాస్త రోజు రోజుకి ఎక్కువ అయిపోయింది. దీంతో ఈ రోజు తన ట్విట్టర్ లో హీరో సిద్దు జొన్నలగడ్డ ఓ సుదీర్ఘ నోట్ ని పోస్టు చేసి తన స్పందనను కనబరిచాడు. 


అంతే కాదు 'ప్రతి ఒక్కరూ నటులను గౌరవించండి' అంటూ నోట్ ను పోస్ట్ చేశాడు. ఇక ఆ ప్రకటనలో..." నా కొత్త చిత్రం థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ సందర్భంగా నా పై ఎన్నో కించపరిచే ప్రశ్నలు విసిరారు. ఆ సమయంలో నా రెస్పాన్స్ కోసం చాలామంది అడిగారు. కానీ నేను ఆ సమయంలో సింపుల్ గానే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా స్కిప్ చేసే ప్రయత్నం చేశాను. కానీ ఇప్పుడు ఆ విషయంతో మరింత మంది ఇండస్ట్రీలో వుండే నటీనటుల కోసం ఏవేవో మాటలు మాట్లాడుతున్నారని నాకు తెలిసింది. మేము యాక్టర్స్. కొన్ని సన్నివేశాల్లో చాలా కష్టంగా ఇబ్బంది పడుతూనే నటిస్తాం. ముఖ్యంగా ఆడ వాళ్లకు ఇది ఎంతో కష్టంగా ఉంటుంది. సినిమా యూనిట్ అంతా ఆ సీన్ చేసేటప్పుడు అక్కడే ఉంటారు.


 అందరి ముందు అలాంటి సన్నివేశాలు చేయాలంటే ఎంతో గుండె ధైర్యం కావాలి. ఈ విషయంలో మమ్మల్ని అర్థం చేసుకొని మా వృత్తిని గౌరవిస్తారు అనుకుంటున్నాను. కానీ ఏవేవో మాటలు మాట్లాడుతున్నారు. మేము ఏది చేసినా ఎంత చేసినా మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేందుకు మాత్రమే అని అందరూ అర్థం చేసుకోవాలి. నేను నా డీజే టిల్లు సినిమా ప్రమోట్ చేసుకోవడానికి మాత్రమే వచ్చాను. నా సినిమాలో అన్ని హంగులు ఉన్నాయి. అందరికీ సినిమా నచ్చుతుంది. మళ్ళీ కలుద్దాం..' అని ప్రెస్ నోట్ తో క్లారిటీ ఇచ్చాడు సిద్దు. ఇక ఇదిలా ఉంటే ఈ ప్రశ్నను సంధించిన సదరు జర్నలిస్టు బహిరంగంగా క్షమాపణ కూడా చెప్పాడు. ఇక విమల కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 11న విడుదల కానుంది...!!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: