ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' సినిమా ఇంకా రికార్డుల వేటను కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికే 50 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏకంగా రూ.350 కోట్లకి పైగా కలెక్షన్స్ ని సాధించినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో పుష్ప సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లో అరుదైన రికార్డు దక్కించుకుంది. ఇక ఈ రికార్డుతో బన్నీ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక గతంలో ప్రభాస్ నటించిన బాహుబలి 2 భాగాలు కూడా భారీ వసూళ్లను దక్కించుకున్న సంగతి తెలిసిందే.
అయితే ఆ వసూళ్లను కచ్చితంగా అల్లు అర్జున్ పుష్ప సినిమా బ్రేక్ చేయలేదు అని అంతా అనుకున్నారు.
కానీ పుష్ప మాత్రం బ్రేక్ చేసి చూపించింది. కానీ ప్రభాస్ నటించిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ సాహో సినిమా వసూళ్లను పుష్ప సినిమా క్రాస్ చేయలేకపోయింది. కొద్దిలో ఆ రికార్డును పుష్పరాజ్ మిస్ చేసుకున్నాడు. ప్రభాస్ సాహో సినిమాతో దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల వసూళ్ళను దక్కించుకున్నట్లు గా బాలీవుడ్ ట్రేడ్ వర్గాల సమాచారం. అయితే బాలీవుడ్లో పుష్ప సినిమా దాదాపు 170 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కానీ పుష్ప సినిమా మాత్రం బాలీవుడ్లో 100 కోట్ల వరకు మాత్రమే కలెక్షన్స్ దక్కించుకుంది.
అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే పుష్ప సినిమాకు బాలీవుడ్లో సరిగ్గా ప్రమోషన్ చేయలేదు.
ఒకవేళ చేసి ఉంటే కచ్చితంగా సాహో రికార్డును బ్రేక్ చేసి ఉండేది. కానీ ఏమాత్రం ప్రమోషన్ లేకుండానే సాహోసినిమా ని బీట్ చేసే స్థాయికి కాస్త అటు ఇటుగా వెళ్లిందంటే అది మామూలు విషయం కాదు. కచ్చితంగా పుష్ప ని బాలీవుడ్ లో ప్రమోషన్ చేసుంటే అక్కడ నంబర్ 3 గా నిలిచి ఉండేది అంటూ అక్కడి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయినా కూడా సౌత్ నుండి అత్యధిక వసూళ్లను దక్కించుకున్న సినిమాల జాబితాలో పుష్ప నాలుగో స్థానాన్ని దక్కించుకుని మరో రికార్డును సొంతం చేసుకుంది..!!