మరో మల్టీ స్టారర్ తో రానున్న రాజమౌళి...!

murali krishna
బాహుబలితో ఒక్కసారిగా తెలుగు సినిమా స్థాయిని పెంచి తెలుగోడి సత్తా ఏంటో చూపించారు దర్శకుడు రాజమౌళి. దీంతో ఈ సినిమా తర్వాత పెద్ద హీరో సినిమా ఏది వచ్చినా కూడా పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్నాయట.
తెలుగు కథలకు ఇతర భాషల్లో కూడా మంచి రెస్పాన్స్‌ వస్తుండడంతో నిర్మాతలు సైతం ఇతర భాషల్లో విడుదల చేయడానికి బాగా సిద్ధమవుతున్నారు. ఇక బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో అన్ని భాషలకు చెందిన నటీనటులు ఉండేలా రాజమౌళి కొన్ని జాగ్రత్తలు తీసుకున్న విషయం తెలిసిందే. దీనికి కారణం చిత్రాన్ని అన్ని భాషల్లో విడుదల చేస్తుండడమేనని తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత జక్కన్న ఓ సినిమాను ప్లాన్‌ చేస్తున్నారట.. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాను కూడా పాన్‌ ఇండియా స్థాయిలోనే విడుదల చేయనున్నారని సమాచారం.. ఈ నేపథ్యంలో సినిమాకు ఇతర భాషల్లోనూ క్రేజ్‌ తెప్పించడానికి జక్కన్న ఒక ప్లాన్‌ కూడా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను మల్టీ స్టారర్‌గా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు వార్త వినిపిస్తుంది.అయితే తెలుగు హీరో కాకుండా తమిళ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ హీరోను జక్కన్న ఇందుకోసం రంగంలోకి దింపనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు మనం వేచి చూడాలి మరి.

ఇక రాజమౌళితో సినిమాకోసం మహేష్‌ ఫ్యాన్స్‌ సైతం ఎప్పటి నుంచో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఫ్యాన్స్‌ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని రచయిత విజయేంద్ర ప్రసాద్‌ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారట. దక్షిణాఫ్రికా అడవుల నేపథ్యంలో ఈ సినిమా కథ ఉండనున్నట్లు విజేయంద్ర ప్రసాద్‌ చేసిన వ్యాఖ్యలతో ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయట. మరి ఈ సినిమా ఇండియన్‌ ఫిలిమ్‌ ఇండస్ట్రీపై ఎలాంటి ముద్ర వేస్తుందో చూడాలి మరి.ఈ సినిమాను ఆస్కార్ రేంజ్ ఉన్న సినిమాగా నిలపాలని రాజమౌళి ప్రయత్నిస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: