నాగార్జున ఆ పాత్ర చేయడానికి ఒప్పుకుంటాడా...?

murali krishna
ఇప్పుడు టాలీవుడ్ మరియు బాలీవుడ్ అని కాదు. ఏ వుడ్‌లో అయినా మల్టీస్టారర్‌ సినిమాల హవా బాగా టైమ్‌ నడుస్తోంది. పెద్ద హీరోలు చాలామంది మరో పెద్ద హీరోతోనో, కుర్ర హీరోతోనో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి బాగా సిద్ధపడుతున్నారు.

అలా సినిమా ప్రేక్షకులకు కనుల పండువ చేస్తున్నారట.తాజాగా మరోసారి అలాంటి కాంబో సిద్ధమవుతోందా? అవుననే అంటున్నాయట.టాలీవుడ్ అండ్‌ కోలీవుడ్‌ వర్గాలు. రెండు వర్గాలు ఏంటి అనే డౌట్‌ పడుతున్నారా ఏంటి అవును రెండు వర్గాలే. ఎందుకంటే ఈ సినిమా మల్టీవుడ్స్‌ స్టార్స్‌తో రూపొందనుందట.

అజిత్‌ - వినోథ్‌ కాంబోలో ప్రస్తుతం 'వలిమై' అనే సినిమా రూపొందుతున్న విషయం అందరికి తెలిసిందే. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా తర్వాత మరో సినిమా ఇదే కాంబినేషన్‌లో ఉంటుందని వార్తలొస్తున్న విషయం అందరికి తెలిసిందే. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌ ఈ సినిమాను నిర్మిస్తారనే విషయమూ మీకు కూడా తెలిసే ఉంటుంది. ఈ సినిమాలో అజిత్‌తోపాటు మరో కీలక పాత్ర ఉందని, దానికి ఎవరు బాగుంటారు, ఎవరు నటిస్తే సినిమాకు సూపర్‌ హైప్‌ వస్తుంది అనే ఆలోచనలో పడ్డారట వారు.. దానికి సమాధానంగా రెండు పేర్లు వచ్చాయని సమాచారం.

 

వినోథ్‌ అండ్‌ టీమ్‌ ఆలోచనలో ఉన్న రెండు పేర్లలో ఒకటి నాగార్జున అయితే రెండోది మోహన్‌ లాల్‌ అని తెలుస్తుంది.ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌గా మారింది. ఆ సినిమా కథలో ఓ పోలీసు పాత్ర ఉందని, దాన్ని స్టార్‌ హీరో ఎవరైనా పోషిస్తే అదిరిపోతుందని చిత్రబృందం అనుకుంటోదని సమాచారం.ఈ క్రమంలోనే ఇతర పరిశ్రమల నుండి తీసుకొస్తే సినిమాకు పాన్‌ ఇండియా కలర్‌ కూడా వస్తుంది కదా అని అనుకుంటున్నారు మేకర్స్.అలా తొలుత నాగార్జునను ఓకే చేసుకునే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది.. ఒకవేళ నాగ్‌ వీలవదు అన్న పక్షంలో మోహన్‌లాల్‌తో మాట్లాడతారని అంటున్నారట.

 

బోనీ కపూర్‌కి నాగ్‌కి మంచి అనుబంధమే ఉంది కనుక అడిగితే ఓకే చెప్పే అవకాశం కూడా ఉంది. అందులోనూ అజిత్‌తో కూడా మంచి రిలేషనే కూడా ఉంది. కాబట్టి అవకాశాలు బాగా ఉన్నాయి. మరి వేరే సినిమాల వల్ల డేట్స్ కుదరకపోతే ఏం చేయలేం. మరి ఈ పుకార్లలో నిజమెంత, సాధ్యమయ్యేదెంత అనేది మనం చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: