ప్రభాస్ ఫ్యాన్స్ కు అదిరిపొయె గుడ్ న్యూస్.. ఎప్పుడేప్పుడా అని ఎదురు చుస్తున్నా ఫ్యాన్స్ కు పునకాలు తెప్పిస్తున్నాయి. సాహో సినిమా తో డీలా పడిన ఫ్యాన్స్ కు ఇది అదిరిపొయె న్యూస్ .. తాజాగా డార్లింగ్ నటించిన మోస్ట్ లవరబుల్ చిత్రం రాధెశ్యామ్ విడుదల తెదీని ప్రకటించారు.ఈ సినిమా ఓటీటీలో రిలీజవబోతుందంటూ గత కొంతకాలంగా రూమర్లు చక్కర్లు కొడుతుండగా అందులో నిజం లేదని చిత్ర యూనిట్ కొట్టి పడేసారు. అలా సినిమా పై వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టారు..
మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా రాధేశ్యామ్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు రిసెంట్‌గా చిత్రబృందం ప్రకటించింది. దీంతో ఈ సినిమా థియేటర్లలోనే మొదట రిలీజవబోతుందని తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇది నిజంగానే గుడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా ఈ సినిమా పై ఎన్ని వార్తలు వచ్చినా అవి నిజం కాదని తేలింది. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదల అయిన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ లు సినిమా పై భారీ అంచనాలను పెంచుతున్నాయి. మొదటి నుంచి ఫ్యాన్స్ కు ఊరిస్తూ వస్తుంది..
ఇది ఇలా ఉండగా ఇప్పుడు మరో అప్డేట్ మరింత ఆసక్థిని సినిమా పై పెంచుతుంది..యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దాదాపు 350కోట్ల వరకు బడ్జెట్ అయినట్లు తెలుస్తుంది.డిజిటల్ శాటిలైట్ హక్కులు భారీ డీల్‌కు కుదిరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అన్నీ ప్రాంతాలలో కలిపి 250 కోట్లు పలికినట్లు తెలిపారు.ఇప్పటికే 70 శాతం రిటర్న్స్ వచ్చినట్టే అంటున్నారు.. ఇకపోతే మరి కొద్ది రోజుల్లో విడుదల కానున్న ఈ సినిమాకు డిమాండ్ రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది.. అందుతున్న సమాచారం ప్రకారం సినిమా భారీ హిట్ ను అందుకుంటుంది..ఇకపోతే ఈ సినిమా విడుదల అయ్యాక మరో సినిమాను వెంటనే విడుదల చేయాలనీ డార్లింగ్ అన్నాడు.. ఆ సినిమాలు ఎలా హిట్ అవుతాయో చూడాలి..