పుష్ప2 మరింత ఆలస్యం అవనుందా!!
ఇక ఈ చిత్రం షూటింగ్ మధ్యలోనే ఈ కథను రెండు భాగాలుగా చేస్తే ప్రేక్షకులకు బాగా అర్థం అయ్యే విధంగా చెప్పవచ్చు అని దర్శకుడు భావించి ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా చేయాలని నిర్ణయించాడు. ఈ నేపథ్యంలో గత ఏడాది డిసెంబర్లో ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రాగా ఇప్పుడు ఈ సినిమా కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తుందని అందరూ భావించారు. కానీ ఇప్పటివరకు ఈ పుష్ప సినిమా షూటింగ్ మొదలు కాకపోవడం తో ఈ చిత్రం సమ్మర్ కి వచ్చే సూచనలు కనిపించడం లేదు.
గత కొన్ని రోజులుగా ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రోజులు ఈ సినిమా విడుదల కాకుండా ఉండడం అంటే నిజంగా ఎంతగానో నిరాశపరుస్తుంది అని చెప్పవచ్చు. కనీసం దసరా పండుగ సందర్భంగా ఆయన ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదల పట్ల దర్శక నిర్మాతలు మరొకసారి ఆలోచన చేస్తారా అనేది చూడాలి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాలోని పాటలు భారీ స్థాయిలో హిట్ అయిన సంగతి తెలిసిందే.