'అమాయకుడే టెర్రరిస్ట్' అయితే పరిణామాలు ఏమిటి?
ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్‌ని న్యాచురల్ స్టార్ నాని రెండు రోజుల క్రితం విడుదల చేసి ఎఫ్ ఐ ఆర్ మూవీ టీమ్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ ట్రైలర్ విషయానికి వస్తే ఇర్ఫాన్ అహ్మద్ అనే ఒక అమాయకపు యువకుడి జీవితం అబూ బక్కర్ అబ్దుల్లా అనే టెర్రరిస్ట్ కారణంగా ఎలా మలుపు తిరుగుతుంది. ఎన్ని సమస్యలను తెచ్చిపెడుతుంది, ఇర్ఫాన్ ఎలా ఎదుర్కుంటారు అన్నది ఈ ట్రైలర్ లో అర్దం అయ్యింది. కాగా ఈ ట్రైలర్ చూసాక సినిమా ఎలా ఉండబోతుంది అన్న గ్రాఫ్ అలా కనిపిస్తోంది. సినిమాలో రొటీన్ గా కాకుండా వైవిధ్యాన్ని చూడాలనుకునే ప్రేక్షకులకు ఈ సినిమా ఖచ్చితంగా మంచి ట్రీట్ అయ్యేలా ఉంది.
అలాగే ఈ మూవీలో యాక్షన్ సన్నివేశాలు కూడా భారీగానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా బాగానే దట్టించినట్లు ఉన్నారు. మరి ఇవన్నీ ఉండటంతో కొత్తదనాన్ని కోరుకునే ప్రతి ప్రేక్షకుడికి ఈ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వనుంది అన్నది టాక్. ఇందులో ఒక అమాయక యువకుడిని ఉగ్రవాదిగా చిత్రీకరిస్తే ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయన్నది తెరమీదనే చూడాలి.