నా అభిమానులే నా బలం... రాజశేఖర్..!

Pulgam Srinivas
టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ ఒక నొక సమయంలో చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున లాంటి స్టార్ హీరోలతో పోటీగా సినిమాలను విడుదల చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి, అయితే రాజశేఖర్ ఆ తర్వాత కాలంలో మాత్రం ఆ రేంజ్ విషయాలను అందుకోవడంలో స్లో అయ్యాడు. అలాంటి సమయంలోనే రాజశేఖర్ అప్పుడప్పుడు సింహరాశి, ఎవడైతే నాకేంటి లాంటి సినిమాలతో విజయాలను అందుకొని  ప్రేక్షకులను అలరిస్తూ వచ్చాడు, ఇది ఇలా ఉంటే రాజశేఖర్ కొన్ని రోజుల క్రితం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన గరుడ వేగ సినిమా బ్లాక్ బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడం తో మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు,  ఆ తర్వాత టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి సినిమాతో  రాజశేఖర్ కు బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశనే మిగిల్చింది, ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రాజశేఖర్ 'శేఖర్' అనే సినిమాలో నటిస్తున్నాడు, థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ మూవీ కి జీవిత రాజశేఖర్ దర్శకత్వం వహించగా  ఈ సినిమాను మరి కొద్ది రోజుల్లో విడుదల చేసే సన్నాహాలు చిత్ర బృందం చేస్తున్నట్లు తెలుస్తోంది.


ఇది ఇలా ఉంటే శుక్రవారం నిర్వహించిన ఆయన పుట్టిన రోజు వేడుకల్లో ఈ మూవీ నుంచి కిన్నెర’ అనే సాంగ్‌ ను చిత్ర బృందం విడుదల చేసింది, ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ..  కొవిడ్‌ సోకినప్పుడు బతుకుతానా లేదా అని అనిపించింది, ఆ సమయంలో అభిమానుల ప్రార్థనలు ఫలించి ఇప్పుడు మళ్లీ మూవీస్ చేయగలుగుతున్నాను అని వారే నా బలం అని రాజశేఖర్ తెలియజేసారు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చాడు, ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ప్రచార చిత్రాలకు జనాల నుండి మంచి రెస్పాన్స్ దక్కుతుంది, మరి రాజశేఖర్ 'శేఖర్'  సినిమాతో ఇలాంటి సక్సెస్ అందుకుంటాడో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: