బన్నీకి ముద్దు ఇస్తా అంటున్న బాలీవుడ్ స్టార్..!

Anilkumar
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా బాలీవుడ్ లో ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా కేవలం బాలీవుడ్ లోనే వంద కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టి అక్కడ స్టార్ హీరోలు అందరికీ గట్టి షాక్ ఇచ్చింది. ఒక టాలీవుడ్ హీరో సినిమా హిందీలో 100 కోట్లు వసూలు అందుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. ఆ ఘనత అల్లు అర్జున్ కు దక్కడం విశేషం. అయితే ఇప్పుడు బాలీవుడ్ పేక్షకులతో పాటు ప్రముఖులు కూడా ‘పుష్ప’ మాయలో పడిపోయారు. అయితే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కి హిందీ లో ఎవరు చెప్పారు చాలా మందికి తెలియదు.


 అయితే హిందీ వెర్షన్‌లో అల్లు అర్జున్ వాయిస్‌కి హిందీ నటుడు శ్రేయాస్ తల్పాడే డబ్బింగ్ చెప్పాడు. ఇకపోతే ఆయన వాయిస్ కి స్పందన చాలా అద్భుతంగా రావడం జరిగింది.అయితే శ్రేయాస్ మరోమారు ఈ సినిమాతో లైమ్‌లైట్‌ లోకి వచ్చాడు. అయితే తాజాగా శ్రేయస్ ఒక ఇంటర్వ్యూ లో పాల్గొనడం జరిగింది అయితే ఆ ఇంటర్వ్యూ లో భాగంగా అల్లు అర్జున్‌ ను కలిస్తే అప్పుడు మీరు ఏం చేస్తారని ఒక ఇంటర్వ్యూలో శ్రేయాస్ ను అడిగారు.  ఇంక తను ఏమాత్రం ఆలోచించకుండా శ్రేయాస్ వెంటనే "నేను బన్నీకి పెద్ద కౌగిలింత, ముద్దు ఇస్తాను. ‘పుష్ప’కు ధన్యవాదాలు" అని చెప్పాడు.


తాజాగా OTTలో విడుదలైన తర్వాత కూడా ‘పుష్ప’ దేశవ్యాప్తంగా అనేక థియేటర్లలో ఆడుతోంది.అంతేకాకుండా ఉత్తరాదిన మాత్రం ఇంకా ‘పుష్ప’ ఫీవర్ నడుస్తోంది. ఇక తాజాగా పుష్ప సినిమా 50 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 365 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి భారీ రికార్డును క్రియేట్ చేసింది. దీంతో ఇప్పుడు పుష్ప పార్ట్ 2 పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఇప్పటికే పాటతో కోసం భారీ ప్లాన్స్ వేసినట్టు తెలుస్తోంది. ఇక పుష్ప పార్ట్ 2 రెగ్యులర్ షూటింగ్ మార్చి మొదటి వారం నుంచి ప్రారంభం కానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: