రాదే శ్యామ్ రన్ టైమ్ ఎంతో తెలుసా..?

Pulgam Srinivas
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్  ఇండియా, అంతకుమించిన సినిమాల్లో నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే, అందులో భాగంగా ప్రభాస్ ప్రస్తుతం నటించిన సినిమా రాదే శ్యామ్ ఈ సినిమాకు రాధా కృష్ణ దర్శకత్వం వహించగా ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయి చాలా కాలం అవుతున్న అనేక కారణాల వల్ల ఈ సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది, అయితే కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా జనవరి 14 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను జనవరి 14 వ తేదీన విడుదల చేయలేదు, అయితే తాజాగా ఈ సినిమాను మార్చి 11 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం రాదే శ్యామ్ హిందీ వర్షన్ సెన్సార్ పూర్తి అయినట్లు తెలుస్తోంది,  ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 31 నిమిషాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.


 రాదే శ్యామ్ హిందీ వర్షన్ చూసిన సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు యూ / ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది,  ఇకపోతే ఇప్పటికే జనవరి 14 వ తేదీన ఈ సినిమాను విడుదల చేసే ఉద్దేశంతో చిత్ర బృందం రాదే శ్యామ్ సినిమా ప్రమోషన్ లను చేసింది, అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీ మారడంతో మరికొన్ని రోజుల్లో తాజాగా ఈ సినిమా ప్రమోషన్ లను చిత్ర బృందం ప్రారంభించే ఆలోచనలు  ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది, మరి  బాక్స్ ఆఫీస్ దగ్గర రాదే శ్యామ్ సినిమా ఎలాంటి విజయన్ని సాధిస్తుందో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: