కమెడియన్ రాహుల్ పై మండిపడుతున్న నెటిజన్స్..!!
అయితే నిన్నటి రోజున ఆ ప్రకటన చేసి ఈ రోజున ఏప్రిల్ ఫూల్ అంటూ మరొకసారి స్టేట్మెంట్ ఇచ్చాడు రామకృష్ణ. మూర్ఖులారా నేను జోక్ చేశాను అని తెలియజేశాడు. కోట్ల సంపాదన , లగ్జరీ లైఫ్ ఇలాంటి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నా లైఫ్లో నేను ఎలా వదిలేస్తాను అని తెలియజేశాడు.. అంతే కాకుండా తన ఫ్రెండ్స్ కూడా ఈ విషయాన్ని తెలుసుకుని రిటైర్మెంట్ విషెస్ ని తెలియజేశారు అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఇక తనను అభిమానించే వారిని ఫూల్ చేయడంతో ఆయన అభిమానులకు కాస్త కోపం తెప్పించింది అని చెప్పవచ్చు. దీంతో ఆయనపై మరికొంతమంది కౌంటర్లు వేయడం కూడా జరిగింది. ఇక తన చిన్న వయసులో కూడా రాహుల్ లైంగిక దాడికి గురైనట్లు గా ఒకరు టైప్ చేయడం కూడా జరిగింది అప్పట్లో.
ఇక అంతే కాకుండా హుషారు డైరెక్టర్ రాహుల్ పై తీవ్ర ఆరోపణలు కూడా చేయడం జరిగింది. ఇక భరత్ అనే నేను సినిమాలో కూడా మహేష్ కంటే ఎక్కువగా రాహుల్ కి పేరు వస్తుందని అందులో కాస్త ఇతని నిడివి తగ్గించారు అని అప్పట్లో రాహుల్ హుషారు డైరెక్టర్ కి తెలియజేసినట్లు గా ఆయన చెప్పుకొచ్చాడు.ఇలాంటి వాటి వల్లే ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నాడు రాహుల్. ఇక అర్జున్ రెడ్డి సినిమా తోనే తన నటన కి మంచి మార్కులు పడ్డాయి అని చెప్పవచ్చు. ఇక తాజాగా జాతిరత్నాలు మూవీ తో మంచి హిట్ ను అందుకున్నారు.