పుష్ప క్రేజ్ ను రైల్వే శాఖ కూడా వదల్లేదుగా..!

Satvika
ఒక్కోసారి కొన్ని డ్తెలాగులు, లేదా సినిమాలోని హీరో చేస్తున్న మ్యానరిజమ్ సినిమాకు హైలెట్ అవుతుంది. అంతేకాదు వాటి వల్ల జనాల నుంచి మంచి స్పందన రావడం కూడా అందరికి షాక్ ఇస్తుంది.. ప్రస్తుతం జనాలకు పుష్ప ఫీవర్ పట్టుకుంది. సినిమా వచ్చి కూడా చాలా కాలం అయిన కూడా దానికి క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. పుష్ప ది రైజ్ సినిమాలోని తగ్గేదేలే అనే డైలాగు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకుంది. అందుకే కలెక్షన్స్ తో పాటుగా జనాల్లొ మంచి గుర్తింపు కూడా తెచ్చుకుంది.


పిల్లల నుంచి పెద్దల వరకు అవతలి వ్యక్తులకు సమాధానం ఇచ్చే సమయంలో తగ్గేదేలే అంటూ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ డైలాగ్ ను చెబుతూ పుష్ప సినిమా ప్రమోషన్స్ ను మరింత పెంచుతున్నారు. మొన్నటి వరకూ పోలీసు వ్యవస్థ పుష్పను వాడుకొని ప్రచారం చేశారు. ప్రమాదాలను అరికట్టే ప్రయత్నం చేశారు. తాజాగా భారత రైల్వే శాఖ కూడా బన్నీ క్రేజ్ ను వాడుకుంది. తగ్గేదేలే అనే డైలాగ్ ను దక్షిణ మధ్య రైల్వే ఇమిటేట్ చేస్తూ రైలు పట్టాలు/ట్రాక్‌లపై నడిచేదేలే అంటూ బన్నీ పోస్టర్ పై రాసుకొచ్చారు.. ఇలా ఒక్కొక్కరు కూడా సినిమా ప్రమోషన్స్ ను పెంచుతున్నారు.


దక్షిణ మధ్య రైల్వే బన్నీ పోస్టర్ తో పాటు ప్రయాణికుల భద్రతే తమకు ముఖ్యమని రైలు పట్టాలపై నడవటం లేదా దాటడం చేయవద్దని పేర్కొంది. సబ్ వే లేదా ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జీలను రైల్వే ట్రాక్ దాటడం కొరకు ఉపయోగిస్తే మంచిదని రైల్వే శాఖ వెల్లడించింది..ఇది ఇలా ఉండగా 50 రోజుల్లో ఏకంగా 365 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఇప్పటికే ఈ కలెక్షన్స్ పై కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చెస్తున్నారు.. పుష్ప ది రైజ్ ను మించి పుష్ప ది రూల్ ఉండబోతుందని సమాచారం అందుతోంది.ఇది వచ్చే నెల నుంచి విదేశాల్లో షూటింగ్ జరుపుకొనున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: