బీ టౌన్: దానికోసమే బయలుదేరుతున్న చెర్రీ..!
ఇలాంటి వారిలో మొదటి ప్రయత్నం చేసిన ప్రభాస్ సక్సెస్ పొంది ప్రస్తుతం రూ. 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్ హీరోగా తన క్రేజ్ ను అమాంతం పెంచేస్తున్నారు. వీరి బాటలోనే కొత్తగా వచ్చిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ కూడా తెలుగు సినీ ఇండస్ట్రీలో కేవలం కొన్ని సినిమాలలో నటించి ఆయన వెంటనే బిటౌన్ వెళ్ళిపోయారు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలో నటించే క్రేజ్ ను సంపాదించుకోవడం గమనార్హం. ఇకపోతే ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న ఎన్టీఆర్ మంచి కథ కనిపిస్తే బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ అందరికీ ఆయన హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే..
ఇదే బాటలోనే తాజాగా రామ్ చరణ్ కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం. అంతేకాదు బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఫేమస్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఒక దర్శకుడి తో చర్చలు కూడా జరిపినట్లు , త్వరలోనే సినిమా కథ గురించి అలాగే అన్ని విషయాల గురించి వెల్లడిస్తామని కూడా ప్రకటించడం గమనార్హం. ఏదిఏమైనా రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నాడు అంటే తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక రామ్ చరణ్ అక్కడ కూడా సక్సెస్ అయితే ఈయన రేట్ మరింత పెరిగిపోతుందని చెప్పవచ్చు.