పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే, అందులో భాగంగా పవన్
కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలో ఒకటి హరిహర వీరమల్లు. ఈ
సినిమా షూటింగ్ ఇప్పటికే కొంత భాగం పూర్తి అయింది, అయితే ఈ
సినిమా షూటింగ్ మధ్యలో ఉండగానే ఈ
సినిమా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి 'కొండపొలం' అనే
సినిమా తెరకెక్కించడంతో హరిహర వీరమల్లు ఈ
సినిమా వాయిదా పడింది. అయితే కొన్ని రోజుల క్రితమే కొండపొలం
సినిమా పూర్తి కావడంతో మళ్లీ హరిహర వీరమల్లు సినిమాను మొదలు పెట్టే ఆలోచనలో
క్రిస్ జాగర్లమూడి ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది ఇలా ఉంటే మరికొన్ని రోజుల్లోనే ఈ
సినిమా ప్రారంభం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి, అందుతున్న సమాచారం ప్రకారం పవన్
కళ్యాణ్ ఈ
సినిమా మొదలు పెట్టాక మళ్ళీ పూర్తి అయ్యే వరకు మొత్తం డేట్స్ ఈ సినిమాకే ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ఐదు భాషల్లో విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది, ఈ సినిమాలో పవన్
కళ్యాణ్ సరసన
నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే
బాలీవుడ్ నటులు
అర్జున్ రాంపాల్,
నర్గీస్ ఫక్రీ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు, ఇదిలా ఉంటే పవన్
కళ్యాణ్ నటించిన భీమ్లా
నాయక్ సినిమా ఈనెల 25 వ తేదీన లేదా ఏప్రిల్ ఒకటో తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అఫీషియల్ గా ప్రకటించింది, ఈ సినిమాలో పవన్
కళ్యాణ్ తో పాటు
దగ్గుబాటి రానా కూడా హీరోగా నటించాడు. ఈ సినిమాలతో పాటు పవన్
కళ్యాణ్,
హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ సినిమాల్లో కూడా నటించబోతున్నాడు అలాగే
టాలీవుడ్ స్టైలిష్ దర్శకుడు సురేందర్
రెడ్డి దర్శకత్వంలో కూడా ఒక సినిమాలో నటించడానికి పవన్
కళ్యాణ్ ఇప్పటికే కమిట్ అయి ఉన్నాడు.