స్టార్ హీరోయిన్ ల రేంజ్ లో అనసూయ కండిషన్స్

P.Nishanth Kumar
బుల్లితెరపై యాంకర్ గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమా లలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అందానికి అందం నటన కనపరచడంతో ఆమెను తమ సినిమాలలో పెట్టుకోవడానికి దర్శక నిర్మాతలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. తొలుత ఆమె ఐటం సాంగులలో నటించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిచింది అనసూయ.  కానీ రంగస్థలం సినిమాలో ఆమె చేసిన పాత్ర ప్రేక్షకులకు విపరీతంగా నచ్చడంతో ఒక్కసారిగా ఆమెకు డిమాండ్ పెరిగిపోయింది అని చెప్పాలి. ఆ సినిమాలో ఆమె నటించిన తీరు కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

ఆ విధంగా ఈ ముద్దుగుమ్మ భారీ స్థాయిలో సినిమా అవకాశాలను అందుకుంటుంది. పుష్ప సినిమాలో ఆమె పోషించిన దాక్షాయిని పాత్ర భారీస్థాయిలో హిట్టయ్యింది దాంతో ఇప్పుడు ఆమె కొన్ని లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేసే అవకాశాలు ఆమెకు వస్తున్నాయట. వాటిలో నటించే విధంగా ఆమె ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. తాజాగా సునీల్ తో కలిసి ఆమె ఓ యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. దర్జా అనే పేరు తో రాబోతున్న ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ ను ఇటీవలే విడుదల కాగా దానికి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.

అయితే తనకు బాగా డిమాండ్ పెరిగి పోవడంతో అనసూయ నిర్మాతలను ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తోందని కొంతమంది చెబుతున్నారు. ఆమె కండీషన్స్ కి వారు తట్టుకోలేక పోతున్నారట. మరి ఆమె ఎలాంటి కండిషన్ పెట్టింది ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అనే విషయం ఎవరికీ తెలియదు. ఇప్పటి వరకు ఏ సినిమా కు కూడా ఆమె ఇబ్బంది పెట్టలేదు అలాంటిది ఈ సినిమాకు ఇలాంటి వార్తలు రావడం నిజంగా ఆశ్చర్యకరం అనే చెప్పాలి. బహుశా ఇది అనసూయ ను బ్యాడ్ చేయడానికి ప్రచారం చేస్తున్నారని అని కొంతమంది చెబుతున్నారు. ఆమెతో పనిచేసిన చాలామంది అనసూయ అలాంటిది కాదని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏ విధంగా ఈ మరకను పోగొట్టుకుంది అనేది చూడాలి. సోషల్ మీడియాలో ఆమె నెటిజన్స్ తో పోట్లాడి విషయం అందరికి తెలిసిందే. ఆడవారిని అగౌరవపరిచే కించపరిస్తే ఏమాత్రం ఊరుకోదు అనసూయ. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: