'భీమ్లా నాయక్' ఆమె కెరీర్ ను మలుపు తిప్పేలా ఉందే?
భీమ్లా నాయక్ కనుక అందరూ ఆశించిన స్థాయిలో ఫలితాన్ని రాబడితే మిగిలిన స్టార్స్ విషయం పక్కన పెడితే హీరోయిన్ నిత్య మీనన్ సుడి తిరిగినట్లే. మునుపటి కన్నా స్పీడ్ గా చాన్స్ లు అందుకోనుంది అని తెలుస్తోంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన 'అయ్యపనుమ్ కోషియమ్' సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. రీ ఎంట్రీ తర్వాత వరుస విజయాలతో దూసుకుపోతున్న పవన్ కు ఈ సినిమా మరింత ప్లస్ కానుందని ఘన విజయాన్ని తెచ్చి పెడుతుందని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
ఒక వైపు సినిమా ప్రమోషన్స్ చూస్తుంటే సినిమా హిట్ కాదు బ్లాక్ బస్టర్ అయ్యేలా కనిపిస్తోంది. మలయాళంలో సూపర్ సక్సెస్ అందుకున్న 'అయ్యపనుమ్ కోషియమ్' మూవీకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంటుంది టీం అంటున్నారు. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రచనా సహకారం అందించిన విషయం తెలిసిందే. ఎస్ ఎస్ థమన్ స్వరాలూ సమకూర్చిన ఈ సినిమాలోని పాటలు అన్నీ ఇప్పటికే విడుదల అయ్యి మంచి పబ్లిసిటీని తెచ్చిపెట్టాయి.