ఎన్టీఆర్ 30 : ఓపెనింగ్ ముహూర్తం రేపే .... ??
ఎన్టీఆర్ కెరీర్ 30వ మూవీగా రూపొందనున్న దీనిని యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు ఎంతో భారీ స్థాయిలో పాన్ ఇండియా రేంజ్ ల నిర్మించనున్నాయి. తాజా రాజకీయ అంశాలపై సాగే ఈ యాక్షన్ పొలిటికల్ కమర్షియల్ ఎంటర్టైనర్ లో ఎన్టీఆర్ ఒక స్టూడెంట్ లీడర్ పాత్రలో కనిపించనున్నారని కొద్దిరోజులుగా మీడియా మాధ్యమాల్లో కథనాలు ప్రచారం అవుతున్నాయి. అయితే అసలు విషయం ఏమిటంటే, ఈ ప్రతిష్టాత్మక సినిమా వాస్తవానికి నేడు ప్రారంభం కావాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వలన ఓపెనింగ్ ని రేపటికి వాయిదా వేశారనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్.
పలువురు అతిథుల సమక్షంలో ఈ వేడుక రేపు ఎంతో గ్రాండ్ గా జరుగనుందని, అయితే ముందుగానే సమాచారం ఇస్తే ఫ్యాన్స్ హడావుడి ఎక్కువగా ఉంటుందని భావించిన యూనిట్, ఈ వేడుక అనౌన్స్ మెంట్ ఇవ్వలేదని సమాచారం. మొత్తంగా అందరిలో ప్రారంభానికి ముందే ఎన్టీఆర్ 30వ సినిమా ఎన్నో భారీ అంచనాలు ఏర్పరిచిందనే చెప్పాలి. మరి రెండోసారి ఎన్టీఆర్, కొరటాల జత కడుతున్న ఈ మూవీ ఎంత మేర సక్సెస్ అవుతుందో తెలియాలి అంటే ఈ మూవీ రిలీజ్ వరకు ఆగాల్సిందే.