మరొక సూక్తి చెప్పి ట్రోల్ అవుతున్న సమంత..?

Purushottham Vinay
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇన్ స్టా స్టోరీలో.. ఏ ఒక్కరు కూడా నీకు క్రమశిక్షణ ఎంత ముఖ్యమో అసలు చెప్పాలనుకోరు. ఈ క్రమశిక్షణ అనేది మనని మనం స్ట్రాంగ్ గా మల్చుకునేందుకు ఉపయోగపడుతుంది. క్రమశిక్షణ అనేది ప్రస్తుత ఆనందాలను టెంపరరీ ఎంజాయ్మెంట్ ను దూరం చేయవచ్చు కాని లైఫ్ లో మంచి ఫలితాలు పెద్ద విజయాలు దక్కడంలో క్రమశిక్షణ కీలక పాత్ర పోషిస్తుంది అంటూ ఉన్న కొటేషన్ ను షేర్ చేసి సమంత నిజం అన్నట్లుగా అక్కడ కామెంట్ పెట్టింది. ఖచ్చితంగా క్రమశిక్షణ అనేది ప్రతి ఒక్కరి లైఫ్ లో అత్యంత కీలకమైనది అనడంలో సందేహం లేదు. సమంత షేర్ చేసినట్లుగా ఎక్కువ క్రమశిక్షణ తో ఉన్నట్లయితే ఖచ్చితంగా టెంపరరీ ఆనందాలు దూరం అవుతాయి. కానీ ఫ్యూచర్ లో ఆ క్రమశిక్షణ వల్ల పెద్ద పెద్ద విజయాలు దక్కుతాయి.. ఆ విషయం అనేది ఎంతో మంది విషయంలో నిజం అయ్యింది.


ఇటీవల సమంత షేర్ చేస్తున్న సూక్తులు ఇంకా అలాగే ఇంట్రెస్టింగ్ లైఫ్ లైన్స్ ఆమె పై మరింతగా గౌరవాన్ని పెంచుతున్నాయి అంటూ కొందరు అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇక అలాగే ట్రోల్స్ కూడా బాగా ఎదురుకుంటుంది సమంత.ఇక ఇదే సమయంలో ఆమె తన గ్లామర్ ఫొటోలను ఇంకా అలాగే డైలీ లైఫ్ ఫొటోలను కూడా షేర్ చేస్తూ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తూ ఉంది. ఇక ఈ హాట్ బ్యూటీ సమంత సినిమాల విషయానికి వస్తే శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీగా ఉంది. మరో వైపు తమిళ సినిమా కూడా ఒకటి విడుదలకు రెడీగా ఉంది. యశోద అనే భారీ పాన్ ఇండియా  సినిమాని కూడా సమంత చేస్తోంది. మరో వైపు బాలీవుడ్ లో కూడా ఈమె గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది. అక్కడ ఇప్పటికే వెబ్ సిరీస్ ను చేసి బాగా సక్సెస్ అయ్యింది సమంత. కాబట్టి ముందు ముందు అక్కడ సినిమాలు ఇంకా వెబ్ సిరీస్ లు పెద్ద ఎత్తున చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. సమంత హీరోయిన్ గా సౌత్ తో పాటు నార్త్ లో కూడా సమానంగా సినిమాలు చేస్తానంటూ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: