రోజా డ్రీమ్ బోయ్ ఎవ‌రో తెలుసా?

Anilkumar
ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం చూడని వారంటూ ఎవరూ ఉండరు. అయితే ఈ షో లో జడ్జిగా వ్యవహరించే రోజాకు ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక రోజా ఒకవైపు ఎమ్మెల్యేగా మరోవైపు జడ్జిగా వ్యవహరిస్తోంది ఎప్పుడూ బిజీ బిజీగా ఉంటుంది. ఇంకా తన బాగా బిజీగా ఉండడంతో సినిమాలో కూడా నటించడం లేదు. అయితే రోజా గతంలో 100కు పైగా సినిమాల్లో నటించి తనకంటూ రోజా ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.  ఇక అసలు విషయానికి వస్తే ఇటీవల ప్రస్తుతం ఉన్న హీరోల్లో మహేష్‌బాబు అంటే ఎంతో ఇష్టమని రోజా వెల్లడించారు. 

ఇక ఈ విషయాన్ని ఆమె జబర్దస్త్‌లోని ఓ స్కిట్ ద్వారా బయటపెట్టారు. ఇక తాజాగా జబర్దస్త్ హోమ్ టూర్‌లో భాగంగా హైపర్ ఆది టీమ్ నగరిలోని ఎమ్మెల్యే రోజా నివాసానికి వెళ్లారు. అక్కడ హాలులో వేంకటేశ్వర స్వామి ఫోటో ఉంది. దాన్ని చూసి హైపర్ ఆది.. ఆయన్ని ఏం కోరుకుంటారమ్మా అని  అడగడం జరిగింది. దానికి రోజా కృష్ణ గారి అబ్బాయి మహేష్ బాబుతో సినిమా చేయాలని ఉందంటూ  కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది. దీంతో వెంటనే హైపర్ ఆది పంచ్ వేశాడు. ఏంటంటే కృష్ణా రామా అని ఇంట్లో కూర్చోవాల్సిన వయసులో మనకెందుకమ్మా ఈ మహేష్ బాబు సినిమాలు అంటూ సెటైర్ వేశాడు ఆది. 

దాని తర్వాత రోజా  కిచెన్ లోకి వెళ్లి టీ పెట్టి హైపర్ ఆది టీమ్ సభ్యులకు ఇచ్చారు. ఇక గతంలో ఆది దొరబాబు ఒక్కడు పేరుతో హైపర్ ఆది స్కిట్ చేయడం జరిగింది. అయితే ఈ స్కిట్‌లో కమెడియన్ దొరబాబు మహేష్ బాబుగా.. శాంతి స్వరూప్ భూమికగా కనిపించారు.  అదే స్కిట్ అయిపోయిన అనంతరం   రోజా‘నువ్వు మహేష్ బాబువా.. ఫ్యాన్ ఇక్కడ.. చంపేస్తాను.. ఇంకోసారి మహేష్ బాబు అంటే’ అంటూ రోజా స్వీట్ వార్నింగ్ ఇచ్చారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: