ప్రభాస్ తో 'కామెడీనా' : మారుతీపై ఫ్యాన్స్ ఫైర్ ?

Purushottham Vinay
నిజానికి ప్రభాస్ - మారుతి కాంబోలో సినిమా అనగానే రెబల్ స్టార్ ఫ్యాన్స్ అందరూ కూడా షాక్ తో సర్ప్రైజ్ అయ్యారు. 'బాహుబలి' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం అదే స్థాయిలో సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ మారుతి ఇంతవరకు కూడా పెద్ద హీరోలతో సినిమాలు చేయలేదు.. ఏ స్టార్ అతనికి ఛాన్స్ ఇవ్వడానికి సాహసం కూడా చెయ్యలేదు. అసలు భారీ బడ్జెట్ ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేసేంత సీన్ కూడా లేదు. అందుకే ఎవరూ ఊహించని కలయిక కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు మిగతా హీరోల ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోయారు.ఇప్పుడు ప్రభాస్ తో హారర్ కామెడీ చేయనున్నారనే వార్తలు కూడా అభిమానులకు అసలు మింగుడు పడటం లేదని సోషల్ మీడియాలో సమాచారం వినిపిస్తోంది. ఇక ఇప్పటికే మారుతి 'ప్రేమకథా చిత్రమ్' అనే హారర్ కామెడీ థ్రిల్లర్ ని తెరకెక్కించడం జరిగింది.


ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ తో ముగ్గురు ముద్దుగుమ్మలతో హారర్ కామెడీ అంటుంటే.. రాఘవ లారెన్స్ 'కాంచన' - ఓంకార్ 'రాజుగారి గది' సినిమాల ఫ్లేవర్ లో ఉంటుందేమో అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.మరోవైపు ప్రభాస్ లాంటి ఇంటర్నేషనల్ స్టార్ ని పెట్టుకొని హారర్ కామెడీ చేయడమేంటి ఏంటి అని మారుతీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ప్రస్తుతానికైతే ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన అనేది రాలేదు. కాకపోతే రెబల్ స్టార్ ప్రభాస్ లైనప్ చూస్తుంటే.. డిఫెరెంట్ జోనర్స్ లో సినిమాలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నట్లు పూర్తిగా అర్థం అవుతోంది. ఇందులో భాగంగా ఈ మారుతితో హారర్ కామెడీ చేసే ఛాన్స్ అనేది లేకపోలేదు. త్వరలోనే ఈ సినిమా పై స్పష్టత వస్తుందేమో అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.ఏదోకలాగా సినిమా క్యాన్సిల్ అయితే బాగుండు దేవుడా అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి ఫ్యాన్స్ ప్రార్ధనలు ఫలిస్తాయో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: