హిజాబ్ వివాదంపై కమల్ హాసన్ ఫైర్.. కారణం..?

Divya
 ప్రస్తుతం ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో ఎక్కువగా హిజాబ్ వివాదం కుదిపేస్తోంది.. రెండు వర్గాలు గా మారిన విద్యార్థుల మధ్య ఘర్షణలు చోటు చేసుకోవడంతో చాలా ఉద్రిక్తతకు దారి తీస్తోంది.. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మూడు రోజుల పాటు సెలవు దినంగా ప్రకటించడం జరిగింది. అయితే ఈ వివాదం పై స్టార్ హీరో కమలహాసన్ స్పందించడం జరిగింది. వస్త్రధారణ విషయం పై ఇరువురు విద్యార్థుల మధ్య మత ద్వేషం మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. దీంతో కర్ణాటక రాష్ట్రంలో తీవ్ర పరిణామాలు కలకలం రేపుతున్నాయి అని తెలియజేశాడు.

ఈ వివాదం వల్ల కొంత మంది అమాయక విద్యార్థులు మధ్య విషపు గొడవలకు దారి తీస్తోంది అన్నట్లుగా తెలియజేశారు. ఈ పరిస్థితులు తమిళనాడు అంతటా పాకి పోకూడదని ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వం తో సహా ప్రతి ఒక్కరూ చాలా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నట్లు ఆయన తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. హిజాబ్ ఈ వ్యవహారంపై నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాల యూసఫ్ జామ్ తన ట్విట్టర్ వేదికగా స్పందించారు. హిజాబ్ లో వస్తున్న విద్యార్థులను చదువుకుని ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని ఇది చాలా దారుణమని తెలియజేస్తోంది.. కొన్ని కాలేజీలు అయితే ఏకంగా చదువా.. హిజాబ్ అనే విధంగా బలవంతం పెడుతున్నట్లుగా ఆమె తెలియజేసింది.
ఇక హిజాబ్ ధరించిన కొంత మంది విద్యార్థులను చదువు తిరస్కరించడం అనేది చాలా దారుణమని.. ఈ విషయాన్ని భారత నేతలు ఆపాలని ఆమె తన ట్విట్టర్ ద్వారా తెలుపుకువచ్చింది. ఈ విషయం జనవరి ఒకటవ తేదీ నుంచి ఈ వస్త్రధారణ విషయం మొదలై ఇప్పుడు చాలా తీవ్ర రూపం దాల్చింది. నిన్నటి రోజున ఉడిపి, బెలగవి, కలబురగి వంటి పలు ప్రాంతాలలో.. హిజాబ్, కాషాయ వస్త్రాలతో విద్యార్థులు కాలేజీ లోకి రావడంతో ఈ ఉద్రిక్తత చాలా అలా ఎక్కువ అయింది. కొన్ని చోట్ల విద్యార్థులు ఘర్షణ పడినట్లుగా కూడా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: