మరోసారి పవన్ - త్రివిక్రమ్ కాంబోలో మూవీ.. కానీ..?

Anilkumar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకి సాగర్ చంద్ర దర్శకత్వం వహించగా ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు రానా నటిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, మాటలు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ అందిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన పోస్టర్లు, పాటలు, టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఇక ఈ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు పవన్.అయితే ఈ సినిమాను ప్రియాడికల్ డ్రామాగా  రూపొందిస్తున్నాడు.

 ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు ప్రారంభం అయ్యాయి కానీ కోవిడ్ కారణంగా వాయిదా పడడం జరిగింది. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడిగా  ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తుంది.హరి హర వీరమల్లు’ సినిమా ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తి గా జరుపుకుంది. అయితే‘భీమ్లా నాయక్’ షూటింగు పూర్తయిన తరువాత ఈ సినిమా కంప్లీట్ చేయాలని చూస్తున్నారు పవన్. విషయంలోకి వెళితే పవన్ ఇప్పుడు తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి ఓ సినిమా చేయబోతున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.  అయితే వీరిద్దరు కలిసి వినోదయ సీతమ్’ అనే తమిళ రీమేక్ లో  నటించనున్నారని తెలుస్తోంది.

 అయితే తాజాగా సముద్రఖని తెరకెక్కించిన ఈ మూవీ ఇటీవల నేరుగా ఓటీటీలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది.  ఇకపోతే ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భాగస్వామ్యంతో పవన్ కళ్యాణ్ తన సొంత బ్యానర్ పీకే క్రియేటివ్ వర్క్స్ మీద నిర్మిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే  ‘వినోదయ సీత’ రీమేక్ ను తెలుగు నేటివిటీకి.. పవన్ కల్యాణ్ ఇమేజ్ కు తగ్గట్టు మార్పులు చేర్పులు చేసే బాధ్యతను కూడా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తీసుకున్నారని అంటున్నారు. అయితే త్రివిక్రమ్ ఇప్పటికే భిమ్లా నాయ క్ రిమేక్ బాధ్యతలను కూడా తీసుకోనున్నారని అంటున్నారు.  త్రివిక్రమ్ ప్రస్తుతం   మహేష్ బాబుతో ఇటీవలే సినిమాని ప్రారంభించారు . అయితే ఇది ఏప్రిల్ నుంచి ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: