బాహుబలి సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు రెబల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం బోలెడు బడా ప్రాజెక్టులు ఆయన చేతిలో ఉన్నాయి.అయితే వరుసగా కొన్ని భారీ బడ్జెట్ సినిమాలను లైన్ లో పెట్టాడు ప్రభాస్.తాజాగా మారుతి డైరెక్షన్లో ఓ సినిమా చేసేందుకు సైన్ చేశారు.అంతేకాకుండా ఈ సినిమాకి "రాజా డీలక్స్" అనే టైటిల్ ను దర్శక నిర్మాతలు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.అయితే ఈ సినిమా ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంతుంది.
అయితే ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు అని అంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మెహరీన్ హీరోయిన్గా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ప్రభాస్ హీరోయిన్ల జాబితాలో ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాలు పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, సలార్ లో శృతి హాసన్, ఆదిపురుష్ లో బాలీవుడ్ భామ కృతి సానన్, ప్రాజెక్ట్ కే లో దీపికా పడుకొనే వంటి స్టార్ హీరోయిన్లు నటిస్తున్నారు. ఇక ఇప్పుడు ప్రభాస్ కి జోడీగా మరో హీరోయిన్ నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి
టాలీవుడ్ లో కృష్ణ గాడి వీర ప్రేమ గాధ ఎఫ్2 మహానుభావుడు వంటి సినిమాలతో హీరోయిన్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న మెహరీన్ కౌర్ ఇప్పుడు కరియర్ లో బ్రేక్ కోసం ఎదురు చూస్తుంది. ఈ మధ్యకాలంలో ఈమె నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయి విజయాన్ని అందుకుంది దీంతో స్టార్ రేస్ లో మళ్ళీ వెనకబడిపోయింది. అయితే మొదటి సారి ప్రభాస్ సరసన మెహరీన్ ను హీరోయిన్ గా అనుకుంటూ ఉండటంతో అందరూ షాక్ కి గురి అవుతున్నారు.అయితే మెహరీన్ కి ఇది కెరియర్ లో ఇది పెద్ద ఆఫర్ అని చెప్పుకోవచ్చు.అయితే ఈ సినిమా ఆమెకు ఎంతవరకు ఉపయోగపడుతుందో వేచి చూడాలి.ప్రస్తుతం హీరోయిన్ నటించిన ఎఫ్ 3 సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది..!!