మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస క్రేజీ సినిమాలో నటిస్తున్న విషయం మనందరికీ మన తెలిసిందే, అందులో భాగంగా ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న సినిమా ఖిలాడి, ఈ సినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ సరసన డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటిస్తున్నారు, ఈ సినిమాను ఫిబ్రవరి 11 వ తేదీన విడుదల చేయబోతున్నారు, అయితే ఇది ఇలా ఉంటే ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో కూడా ఒకే రోజు భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.
ఈ సినిమాతో రవితేజ బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించబోతున్నాడు, రవితేజ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబందించిన సెన్సార్ కార్యక్రమాలు కూడా తాజాగా పూర్తయ్యాయి, ఈ సినిమాకు సెన్సార్ యు / ఎ సర్టిఫికెట్ ను జారీ చేసింది. ఖిలాడి సినిమా రన్ టైం 150 నిమిషాలు గా చిత్ర బృందం సెట్ చేసినట్లు తెలుస్తోంది, ఇది ఇలా ఉంటే ఉంటే ఇప్పటికే మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమాకు బిజినెస్ కూడా భారీగా జరిగినట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి నైజాంలో రూ. 8 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలుపుకుని రూ. 10 కోట్ల మేర బిజినెస్ జరిగింది . ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సినిమాకు మొత్తంగా రూ. 21.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి, ఇది ఇలా ఉంటే ఓవర్ సిస్ లో కూడా ఈ సినిమాకు బాగానే బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది, ఓవర్సీస్‌లో ‘ఖిలాడీ' మూవీకి రూ. 1.20 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.10 కోట్లు బిజినెస్ జరిగింది. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాలనూ కలుపుకుంటే ఈ సినిమాకు మొత్తంగా రూ. 24.80 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలిసింది. దీనితో ఖిలాడి మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 25.50 కోట్లుగా ఉంది, అంటే.. అన్ని కోట్లు వస్తేనే ఖిలాడి సినిమా హాట్ అవుతుంది.