విజయవాడకు చేరుకున్న సినీ పెద్దలు..!!

Divya
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో సినిమా టికెట్ల రేట్లు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి పై ముఖ్యమంత్రి జగన్ తో చర్చించడానికి టాలీవుడ్ సినీ పెద్దలు తాజాగా విజయవాడ కు చేరుకున్నారు.. ఇప్పటికే టికెట్ రేట్ల పై పలు ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగింది.. అంతేకాదు సినీ పరిశ్రమకు సంబంధించిన 17 అంశాలను సినీ పెద్దలు అందరూ ఒక లిస్టు ను తయారు చేసి సీఎం జగన్ ముందు పెట్టనున్నట్లు సమాచారం.. ముఖ్యంగా టికెట్ల ధరలు, పరిశ్రమ అభివృద్ధి, పరిశ్రమలో ఉన్న సమస్యలపై చర్చించనున్నారు.
గత కొద్ది సమయం కిందట బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సినీపెద్దల బృందం విజయవాడకు చేరుకోవడం జరిగింది . తదనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తాడేపల్లి సీఎం ఆఫీస్ కు చేరుకున్నారు.. ఎవరెవరు వచ్చారు అనే విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవితో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు,  రెబల్ స్టార్ ప్రభాస్,  దర్శక ధీరుడు రాజమౌళి తో పాటు కొరటాల శివ, నటుడు ఆలీ, ఆర్ నారాయణ మూర్తి,  పోసాని వంటి ప్రముఖులు జగన్ తో బేటీ అవ్వడం జరిగింది.

ఇకపోతే సినీ పెద్దలు ఎక్కువమందికి అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరగా కొవిడ్ కారణంగా కేవలం తక్కువమందే రావాలని సూచించినట్లు మంత్రి పేర్ని నాని వెల్లడించారు. జీవో నెంబర్ 35 ( టిక్కెట్ల రేట్లపై నిర్దేశించిన జీవో) తో ముదిరిన సమస్యను ఈ భేటీలో పెద్దలు సాల్వ్ చేయబోతున్నారు.. ఇకపోతే భారీ బడ్జెట్ తో సినిమాలు తీయడం పాన్ ఇండియా మూవీ లతో ఇండస్ట్రీ దేశానికి కేరాఫ్ అడ్రస్ గా మార్చిన నిర్మాతలకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన రేట్లతో పెద్దగా లాభం లేదు అంటూ చెప్పుకొచ్చారు.. ఇప్పటికే కొన్ని థియేటర్లు స్వచ్ఛందంగా మూసేసి మరి కొన్ని రూల్స్ పాటించడంలేదని అధికారులే క్లోజ్ చేయడం జరిగింది.
ఇకపోతే పెద్ద సినిమాలు సైతం  థియేటర్లలో విడుదలై మంచి కలెక్షన్లను రాబట్టిన విషయం తెలిసిందే.. కానీ పాన్ ఇండియా సినిమాలు మాత్రం విడుదలకు సిద్ధంగా లేవని అందుకే సినీ పెద్దలు మొత్తం జగన్ తో భేటీ కావడం జరిగింది. మరి ఈ భేటీ తర్వాత ఎలాంటి ఫలితాలు వెలువడనున్నాయో తెలియాల్సి ఉంది..
ఇదిలా ఉండగా మహేష్ బాబు - నమ్రత 17 వ పెళ్లిరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో ..హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకున్న ఫ్లైట్ లోనే చిరంజీవి మహేష్ బాబుకు బొకే ఇచ్చి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: