సూపర్ స్టార్
రజినీకాంత్ తాజాగా తలైవార్ 169 షూటింగ్ కోసం రెడీ అవుతున్నారు. నెల్సన్
దిలీప్ కుమార్ ఈ సినిమాకి దర్శకుడు కాగా.. అనిరుధ్
రవి చందర్ సంగీతం అందిస్తున్నారు.ఇక తాజాగా రిలీజ్ చేసిన మోషన్
పోస్టర్ లో నెల్సన్ ఇంకా అనిరుధ్ ఎంతో స్టైలిష్ గా సూట్ లు ధరించి ఫోజులివ్వగా.. ఇంకా సూపర్ స్టార్ రజనీకాంత్ ఇస్టయిల్ ముందు ఇంకెవరూ నిలబడలేరు అన్నంతగా విజువల్స్ ని తీర్చిదిద్దిన తీరు అయితే ఆసక్తిని కలిగించింది.డైరెక్టర్ నెల్సన్
దిలీప్ కుమార్ మరోసారి క్లాసీ స్టోరీతో ముందుకు వచ్చాడని తాజా విజువల్ చెబుతోంది.
నయనతార నటించిన కోలమావు కోకిల సినిమాతో
సక్సెస్ ఫుల్ గా అరంగేట్రం చేసి రీసెంట్ గా యంగ్
హీరో శివకార్తికేయన్ తో
డాక్టర్ తో హిట్ కొట్టాక.. ప్రస్తుతం
దళపతి విజయ్ తో బీస్ట్ అనే భారీ బడ్జెట్
సినిమా చేస్తున్న ఈ
యువ దర్శకుడు ఆ వెంటనే
సూపర్ స్టార్ రజనీకాంత్ తో ఆఫర్ అందుకోవడం గ్రేట్ అనే చెప్పాలి.
సూపర్ స్టార్ రజనీకాంత్ తో నెల్సన్ సినిమాని ఈరోజు ఆఫీషియల్ గా ప్రకటించారు.నెల్సన్
దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న బీస్ట్
సినిమా నిర్మాతలుగా ఉన్న సన్ పిక్చర్స్ తలైవార్ 169ని నిర్మిస్తోంది.
ఈ సినిమాకి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.
యువ సంగీత దర్శకుడు అనిరుధ్ ఇదే దర్శకుడితో వరుసగా నాల్గవసారి కలిసి పని చేస్తున్నారు. పేట-
దర్బార్ సినిమాల తర్వాత రజనీ కాంత్ తో ఇది మూడో చిత్రం.నెల్సన్
దిలీప్ కుమార్ తన మూడవ
సినిమా బీస్ట్ ని రిలీజ్ చేసేందుకు రెడీగా ఉన్నాడు. ఈ సినిమాలో
విజయ్ ప్రధాన పాత్రలో నటించాడు. ఈ
సినిమా ఏప్రిల్ నెలలో విడుదల కానుంది. ప్రతిభావంతులైన దర్శకుడు ప్రస్తుతం ఈ
సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనిలో బిజీగా పనిచేస్తున్నాడు. బీస్ట్ విడుదల తర్వాత అతను రజనీకాంత్ తో తన సినిమాని ప్రారంభించనున్నాడు. తన ప్రతి సినిమాకి కూడా వెరైటీ కాన్సెప్టునే ఎంచుకునే నెల్సన్ ఈ సారి రజనీ కాంత్ కి ఎలాంటి కథను రాసారు అన్నది ఇప్పుడు క్యూరియాసిటీని పెంచుతోంది.