ఏ ఫిల్మ్ బై అరవింద్ సినిమా అవకాశం నాకే వచ్చింది కానీ... హీరో ఆకాష్..!

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీలోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది హీరోలు ఎంట్రీ ఇస్తూ ఉంటారు,  అలా ఎంట్రీ ఇచ్చిన వారిలో కొంతమంది హీరోలు  మొదటి సినిమాతోనే మంచి విషయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటూ ఉంటారు.  కానీ మొదటి సినిమా మంచి విజయం సాధించినప్పటికీ ఆ తర్వాత మాత్రం ఆ రేంజ్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోలేక కొంతమంది హీరోలు డీలా పడిపోతుంటారు,  ఇలా మొదటి సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే విజయాన్ని అందుకొని ఆ తర్వాత ఆ రేంజ్ విజయాలను అందుకోలేకపోయిన హీరోలలో ఆకాష్ ఒకరు.  హీరో ఆకాశ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.


 ఆకాష్ , శీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఆనందం సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించాడు,  ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.  ఇలా ఈ సినిమా  మంచి విజయం సాధించడంతో హీరో ఆకాష్ కు  కూడా టాలీవుడ్ లో మంచి గుర్తింపు దక్కింది,  కాకపోతే ఆనందం సినిమా తర్వాత హీరో ఆకాష్ చేసిన సినిమాలు పెద్దగా బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ కాలేకపోయాయి.  ఇది ఇలా ఉంటే తాజాగా హీరో ఆకాష్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు.  ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఆకాష్ మాట్లాడుతూ..  ఏ ఫిల్మ్ బై అరవింద్ సినిమా అవకాశం నాకే వచ్చింది, కాకపోతే నేను తమిళ సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఏ ఫిల్మ్ బై అరవింద్ సినిమా చేయలేకపోయాను అని తాజా ఇంటర్వ్యూలో ఆకాష్ తెలియజేశాడు. తను వెంకటేష్ పక్కన నమో వెంకటేశా, వసంతం సినిమాలో నటించాను,  కానీ నేను ఇండస్ట్రీ లోకి వచ్చింది హీరో అవ్వాలని ఆ తర్వాత సైడ్ క్యారెక్టర్ వచ్చిన సినిమాలు చేయలేదు అని హీరో ఆకాష్ తాజా ఇంటర్వ్యూ లో భాగంగా తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: