రజిని 169 మూవీ అనౌన్స్మెంట్.. వచ్చేసిందిగా..!!
వాస్తవానికి ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నప్పటికీ రజనీకాంత్ కేవలం ఒక్కడే ఉంటారని చెప్పవచ్చు. అందుకే ఈ హీరో పేరు శివాజీరావు కాస్త సూపర్ స్టార్ రజినీకాంత్ గా మారిపోయాడు. రజినీకాంత్ ప్రస్తుతం వయసు 71 సంవత్సరాలు అయినప్పటికీ.. తన స్టయిల్లో సినిమా కంటెంట్ ని ఎక్కడ తగ్గకుండా చూస్తూ ఉంటాడు. అలా ఇప్పుడు తాజాగా 169 వ సినిమాకి సంబంధించి షూటింగ్ కోసం సిద్ధమవుతున్నాడు.. ఇక ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు కాగా.. సంగీత దర్శకుడు అనిరుధ్ వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక మోషన్ పోస్టర్ లో వీరిద్దరి చూపించడం జరిగింది.
ఈ పోస్టర్ వీడియోలో రజనీకాంత్ స్టైల్ ముందు ఇంకెవరు నిలబడేలా కనిపించినంతగా విజువల్స్ ని తీర్చిదిద్దడం గమనార్హం. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్.. మరొకసారి ఒక క్లాస్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా కనిపిస్తోంది. నయనతారతో కలిసి ఒక సినిమా చేశాడు ఈ డైరెక్టర్ . ఇక ఇటీవల కాలంలో శివ కార్తికేయన్ తో డాక్టర్ బాబు మూవీ సక్సెస్ కావడంతో విజయ్ తో బీస్ట్ సినిమా అయిపోగానే.. రజనీకాంత్ తో ఆఫర్ ను సంపాదించుకున్నాడు. ఈ మూవీని సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్నారు.