కొన్ని కొన్ని సినిమాలు ఎంతో ఇష్టంగా చేస్తూ ఉంటారు మన హీరోలు. వాటికి మంచి దర్శకులను పెట్టుకొని స్వయంగా అన్ని దగ్గరుండి చూసుకొని సినిమాలలో ఎంతో గొప్పగా చేస్తూ ఉంటారు. అయితే ఆ సినిమాలు వారికి కొరకరాని కొయ్యగా మారినప్పుడు వారికి ఎంతో నిరాశ కలిగిస్తుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితే ఆచార్య సినిమాకు ఎదురయ్యింది అని చెప్పవచ్చు. కొడుకు నిర్మాణ సారథ్యంలో కొరటాల శివ లాంటి భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తీసే దర్శకుడితో కలిసి మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని చేశాడు.
అయితే కరోనా ఈ సినిమా పాలిట దయ్యం అయ్యిందని చెప్పవచ్చు. ఈ సినిమా విడుదలను అనుకున్న ప్రతిసారి కరోనా ఈ చిత్రాన్ని పట్ట్టు పట్టినట్లుగా వెంటాడి అది వాయిదా అయ్యేలా చేసేది. దాంతో ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉండడం అనే సంగతి పక్కన పెడితే ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తే చాలు అనే విధంగా ఈ చిత్రం యొక్క క్రేజ్ మారిపోయింది. దర్శకుడు కొరటాల శివ అయితే ఈ చిత్రంతో చాలా సమయాన్ని కోల్పోయాడు అని చెప్పవచ్చు. దాదాపు సంవత్సరం పాటు ఈ సినిమా పనులను చేసుకుంటూ ఖాళీగా కూర్చున్నాడు ఈ గ్రూపులో ఆయన ఓ సినిమా కూడా పూర్తి చేయవచ్చు.
అలాంటిది ఈ ఆచార్య సినిమా ఆయనను ఇప్పటివరకు ఎన్నో ఇబ్బందులు పెట్టగా చిరంజీవికి కూడా ఇది తలనొప్పిగా మారిందని ఆ వ్యవహారం ఇప్పుడు ఇప్పుడే బయటకు వస్తుంది. మెగా అభిమానులు ఆయన సినిమా కోసం ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నారు పరిస్థితులు నార్మల్ అయిన నేపథ్యంలో కూడా తన సినిమాను విడుదల చేయకపోవడంపై చిరంజీవికి అభిమానుల నుంచి ఒత్తిడి పెరిగిందట అయితే ఫిబ్రవరి 4వ తేదీన విడుదల చేద్దామని చూపించడం ఈ సినిమా వాయిదా పడేలా చేసింది. ఈ నేపథ్యంలో లో ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుండగా అప్పుడు ఈ సినిమాపై ఎంతటి క్రేజ్ ను తీసుకు వస్తారో చూడాలి.