బుల్లితెర ద్వారా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునీ అనసూయ భారీ స్థాయిలో ఇమేజ్ ను మూటగట్టుకుంది. ఇప్పుడు పెద్ద సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసే స్థాయికి ఎదిగింది అంటే నిజంగా అనసూయ సినిమాల పట్ల ఎంతటి అంకిత భావంతో ఉందో అర్థం చేసుకోవచ్చు. మొదటగా యాంకర్ గా తన జీవితాన్ని ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ మెల్లగా క్రేజ్ సంపాదించుకొని ఇప్పుడు ఇంతటి స్థాయి ఆర్టిస్ట్ గా ఎదిగింది. ఈమె భారీ సినిమాలు చేసే స్థాయికి ఎదగడం కారణం సుకుమార్.
ఏ ముహూర్తాన ఈమెను రంగస్థలం సినిమాలోని రంగమ్మత్త పాత్రకు సెలెక్ట్ చేశాడో కానీ అప్పటి నుంచి ఆమె దశ తిరిగింది. ఆ సినిమాలో అద్భుతమైన నటన కనబరిచిన అనసూయకు ఆ తర్వాత భారీ స్థాయిలో సినిమా అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. అలా ఇప్పుడు మరిన్ని సినిమాల్లో ప్రేక్షకులను అలరిస్తున్న ఆమె కిలాడీ సినిమాలోని పాత్ర తో అందరిని ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది అనే చెప్పాలి. అనసూయలో ఇంత టాలెంట్ ఉందా అనే విధంగా నటించి అందరి నోర్లు వెళ్ల పెట్టుకునేలా చేసింది. హీరోయిన్ లను మించిన సౌందర్యం తో ఈమె ఈ సినిమాలో హీరోయిన్ లు సైతం డామినేట్ చేసింది.
ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రాగా ఇది ప్రేక్షకులను బాగానే అలరిస్తుంది అని చెప్పవచ్చు. అలా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఈ చిత్రం భవిష్యత్తులో ఇంకా ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి. ఇకపోతే అనసూయ కూడా ఈ సినిమా తర్వాత మరిన్ని సినిమాల్లో నటించే విధంగా ప్లాన్ చేసుకుంది. సినిమా ఆఫర్లు కూడా వస్తుండడం చూస్తుంటే ఈమె ఓ చిన్న సైజు హీరో మార్కెట్ ను ఏర్పరుచుకుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓవైపు రియాల్టీ షోలో ఇంకొకవైపు సినిమాలు చేస్తూ మునుపటి కంటే బిజీగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. మరి అనసూయ ముందు ముందు ఇంకా ఎలాంటి పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.