వారెవ్వా: చిరంజీవి - బాబి సినిమా కొత్త టైటిల్ ఇదే..!

N.ANJI
తెలుగు చిత్ర పరిశ్రమలో లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీకి కొంత విరామం ప్రకటించిన తరువాత వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ ఇండస్ట్రీలో బిజీగా రాణిస్తున్నారు. ఆయన ప్రస్తుతం తనయుడు రామ్‌చరణ్‌తో కలిసి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకునే దిశ వైపు అడుగులు వేస్తుంది.

ఈ సినిమా షూటింగ్ సమయంలోనే మరో రెండు సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఇప్పుడు ఆయన వరుసగా భోళాశంకర్ - గాడ్‌ఫాదర్ సినిమాలలో నటించనున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్‌తో జై లవకుశ, వెంకీతో వెంకీమామ సినిమాలు చేసిన కేఎస్‌. రవీంద్ర (బాబి) దర్శకత్వంలో ఓ సినిమా చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రాన్ని  మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.

అంతేకాక.. మళ్లీ వింటేజ్ మెగాస్టార్‌ను గుర్తు చేసేలా ఈ సినిమా కథను దర్శకుడు బాబి డిజైన్ చేసినట్టు సమాచారం. ఈ మూవీ విషయంలో దర్శకుడు బాబి ముందు నుంచి చాలా కాన్ఫిడెంట్‌గానే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే మెగాస్టార్ అభిమాని అయిన బాబి.. అదే మెగాస్టార్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడంతో ఆనందంతో తబ్బిఉబ్బవుతున్నారాని ఇండస్ట్రీ వర్గంలో టాక్ వినిపిస్తుంది. ఇక ఈ చిత్రానికి మేకర్స్‌ సాలిడ్ టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

అయితే అంతక ముందు ఈ సినిమాకి వాల్తేరు వీరయ్య అన్న టైటిల్ ఫిక్స్ చేసినట్టు వార్తలు వినిపించగా.. ఇక ఇప్పుడు చిరు చేసే రోల్‌కు పర్‌ఫెక్ట్‌గా మ్యాచ్ అయ్యేలా మరో టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. కాగా.. ఈ మూవీ యూనిట్ వర్గాలు, మెగా కాంపౌండ్ పీఆర్ టీం నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఈ సినిమాకు వాల్తేరు మొనగాడు టైటిల్ పెట్టినట్టు టాక్ వినిపిస్తుంది. ఇక ఈ తరహా మాస్ టైటిల్స్ చిరుకు బాగా యాప్ట్ అవుతాయని అనుకుంటున్నారు. ఒక్కవేళ ఈ టైటిల్‌తో చిరు వస్తే బాక్సాఫీస్ దగ్గర ఆయన అభిమానులు, మాస్ జనాల దుమ్ము రేగిపోవడం ఖాయమని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: