తెలుగు చిత్ర పరిశ్రమ ఒకప్పుడు వరుస సినిమాలతో బిజిగా ఉండేది. అంతేకాదు.. కాసుల వర్షం కురుస్తోంది.. దాంతో సినిమా ఇండస్ట్రీ చాలా బాగా ఉనింది. ఈ మాయదారి కరోనా వచ్చిన తర్వాత ఆ ముచ్చట లేదు.. ఎప్పుడూ సినిమాలతో , జనాల సందడి తో కలకల లాడుతున్న చిత్ర పరిశ్రమ ఒక్క సారిగా మూగ బోయింది.. ఇప్పుడు కరొన ప్రభావం తగ్గిన కూడా పెద్దగా ప్రయోజనం లేదు. ఏపీలో సినిమా టిక్కెట్ ధరల థగ్గింపు పై రభస కొనసాగుతుంది.. కరోనా కారణంగా సినిమా పరిశ్రమ ఎన్ని కష్టాలను ఎదుర్క్కొన్న సమస్యల గురించి కొన్ని నెలలుగా చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే..
ఈ చర్చలు ఒకకొలిక్కి రాలేదు.. ఈ విషయం పై మెగాస్టార్ చిరంజీవి ముందుండి నడిపిస్తూ వస్తున్నారు. సినీ పరిశ్రమ కష్టాల పై పలు మార్లు ఎపి సీఎం తో చర్చలు జరిపారు.. తాజాగా నిన్న ఏపి సీఎం జగన్ , పేర్ని నానీ తో చిరంజీవితో పాటుగా మరి కొంత మంది సినీ ప్రముఖులు కలిశారు..చిరంజీవి తనతో పాటు మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, నిరంజన్ రెడ్డిలు కలిశారు.. ఎప్పుడూ ఇలాంటి మీటింగ్ లు జరిగిన సీక్రెట్ గా ఉంచెవారు. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా వీడియోలు కూడా బయట పెట్టారు..ఆ వీడియోలు చూసిన వారంతా బాధపడుతూ కొత్త ప్రశ్నలు అడుగుతున్నారు..
ఇది నిజంగా మనసును కరిగిస్తుంది. ఈ విషయం పై గతంలో చాలా మంది ఏపీ సర్కార్ ను కలిశారు. అందులో పవన్ కళ్యాణ్, వర్మ లు కూడా ఉన్నారు.సినీ పరిశ్రమని రక్షించమని, థియేటర్స్ ని రక్షించమని ప్రాధేయపడ్డారు. మెగాస్టార్ చిరంజీవి అయితే చేతులెత్తి దండం పెట్టి సినిమా పరిశ్రమని కాపాడండి అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు... ఆ విధానం అందరినీ కదిలించింది. ఈ ముగ్గురి పాత్ర ఎక్కువగా వుంది. ఒక్కొక్కరూ ఒక్కోవిధంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.. మరి ఎపి సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందొ చూడాలి..